Pawan Kalyan : తాజాగా “ది రియల్ యోగి” పుస్తకాన్ని ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి రచయిత గణ అద్భుతంగా రాశారు. కళ్యాణ్ బాబు గురించి నేను ఏమనుకుంటున్నానో.. దగ్గర దగ్గరగా అలాగే రాశాడు.. అందుకే ఈ పుస్తకం ఇంకా నచ్చింది అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొని మాట్లాడడం జరిగింది.. పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి చిన్నప్పటి నుంచి భిన్నంగా ఉండేది. సినిమాలకు రాకముందు కెరియర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటావని అన్నయ్య అడిగితే.. క్వాలిటీ గా ఉండే సినిమాలు ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చాలు అని అన్నాడు అని, తాను హీరో అయిన తర్వాత కూడా అదే పాటిస్తున్నాడు అని.. ఎదుటివాడు బాధలో ఉంటే తను హాయిగా ఉండలేడు అంటూ తన తమ్ముడి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు నాగబాబు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ జీవితం గురించి రాసిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవాలని మరింతమంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పార్టీ పెట్టడం వెనుక అసలు కారణం ఇదే అంటూ తెలియజేస్తున్నారు.. రాజకీయాలలోకి పదవుల కోసం కాదు.. లంచగొండితనంతో సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్న.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న అవినీతి, లంచగొండి రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికి జనసేన పార్టీని స్థాపించారట పవన్ కళ్యాణ్. అంతేకాదు ఈ పుస్తకంలో పవన్ కళ్యాణ్ ని ఎక్కడ గాడ్లి పర్సన్ గా హైలైట్ చేయడానికి ప్రయత్నించలేదు.. ఈ పుస్తకం ఎంత హిట్ అవుతుందో తెలియదు కానీ అందరూ ఒకసారి తప్పకుండా చదవాల్సిన పుస్తకం అని నాగబాబు వెల్లడించారు.