Sitara Ghattamaneni : టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. ఆయన భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా మహేష్ బాబుతో కలిసి నటించిన ఈమె అతనితోనే ప్రేమలో పడి.. కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు దూరమై పూర్తిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇంటికే పరిమితమైన ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ.. మహేష్ బాబు సినిమాలలో తనకు పోకిరి సినిమా అంటే ఇష్టం అని.. వంశీ సినిమా అంటే నచ్చదు అని తెలిపింది.
అయితే ఈ క్రమంలోనే తన కుమార్తె సితార గురించి మాట్లాడుతూ.. సితార మాకు అన్వాంటెడ్ బేబీ.. మేము సితార ను కనాలని అనుకోలేదు. ఒకవేళ సితార లేకపోతే మా జీవితం అసంపూర్తిగా మిగిలి ఉండేది అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది నమ్రత. గౌతమ్ పుట్టిన సమయంలో ఎంతో స్ట్రగుల్ అయ్యామని అసలు గౌతం బతుకుతాడో లేదో అని వైద్యులు కూడా చెప్పలేకపోయారు అంటూ అప్పటి చేదు జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంది.