Bigg Boss 6 Telugu : రేపటితో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ముగియబోతున్న నేపథ్యంలో 15వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. అయితే ఈసారి అందరూ కీర్తి భట్ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీ సత్య ఎలిమినేట్ అయింది. మరో రెండు రోజుల్లో షో ముగిస్తుంది అనగా ఆమె ఎలిమినేషన్ అందరికీ షాక్ ఇచ్చింది.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా అంటే అవును.. కానీ ఆమె కన్నా స్ట్రాంగ్ గా కీర్తి ఉంది కాబట్టే ఆమె హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. బిగ్బాస్ సీజన్ 6 లో హౌస్ లో ఉన్నంత సేపు తన ఆట తీరుతో ఆడియన్స్ ను మెప్పించిన ఈమె 15 వారాలకు గాను ఎంత పారితోషకం తీసుకుందనేది ఇప్పుడు వైరల్ గా మారింది.

వారానికి లక్ష రూపాయల డీల్ తో సెట్ చేసుకొని హౌస్ లో 15 వారాల పాటు తన ఆట తీరుతో మెప్పించింది. ఈ సీజన్ మొత్తం మీద ఈమెకు రూ. 15 లక్షల వరకు పారితోషకం లభించిందని సమాచారం. చివరివారం అది కూడా మరో రెండు రోజులు ఉండి ఉంటే బాగుండేదని ఆమె అభిమానులు కూడా కోరుకున్నారు. కానీ ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యింది.