Big Boss 6 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. కొందరు ఫ్రెండ్షిప్ అంటూ జట్టుగా ఆడుతుంటే మరి కొందరు సోలో గేమ్ ఆడుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో ఇనయ గేమ్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఎంత మంది ఆమెని టార్గెట్ చేసిన కూడా ఇనయ గట్టి పోటి ఇస్తూ తమ సత్తా చాటుతుంది. గీతూ వెళ్లిపోయిన తర్వాత ఆదిరెడ్డి ప్రవర్తన పూర్తిగా మారింది. ఇనయ మీద నోరు పారేసుకోవడం మాత్రమే కాకుండా ఆమెకు ఎక్కువ హైప్ ఇస్తున్నాడు.ఇక ఫైమా, శ్రీహాన్, శ్రీ సత్య వంటి వారు కూడా ఇనయ హైప్ పెంచుతున్నారు.
Big Boss 6 Telugu : సూర్య ఫుల్ సీరియస్..
హౌస్ లో అందరూ ఇనయ అని టార్గెట్ చేయడంతో ఆమెకు బయట అది పాజిటివ్ మారుతుంది. ఇక బిగ్ బాస్ ఈవారం వరస్ట్ పెర్ఫార్మర్ ను ఎంచుకోమని చెప్పడంతో చాలామంది కంటెస్టెంట్లు ఇనయ కే ఓటు వేశారు..ఎక్కువ ఓట్లు ఇనయ కు పడటంతో ఆమెను వరస్ట్ పర్ఫామర్ గా ఎంపిక చేసి ఫైమా ఆమెని జైలుకు పంపించారు.అయితే కుటుంబ సభ్యులు అందరూ ఆమెనే టార్గెట్ చేస్తూ ఉండడంతో ఇనయకు బయట మరింత మద్దతు పెరుగుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అందరూ కలిసి కౌశల్ మాదిరిగా ఇనయ కు టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారు అంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
ఇనయకి హౌజ్‌లో సూర్య మద్దతు చాలా ఉండేది. ఆమె లోన్ లీగా ఉన్నప్పుడు సూర్య చాలా ధైర్యం అందించేవాడు. ఇనయ ఎలిమినేషన్ నుండి సేఫ్ అయిన తరువాత చాలా సంతోషించేవాడు. ప్రతిసారి ఆమెకు సపోర్ట్‌గా ఉండేవాడు.ఇప్పుడు హౌజ్‌లో ఆమెని ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తుండడంతో సూర్య చాలా ఫైరింగ్‌గా ఉన్నాడట. ఆడపిల్లని చేసి ఇలాంటి గేమ్ ఆడడం బాగోలేదంటూ సూర్య రగిలిపోతున్నట్టు తెలుస్తుంది.