Bigg Boss 6 Telugu : ” నేను గర్భవతిని ” బిగ్ బాస్ కంటెస్టెంట్ బిగ్ ప్రకటన !

Bigg Boss 6 Telugu :  బిగ్ బాస్ షోతో చాలా మంది వెలుగులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అలా తెలుగు బిగ్ బాస్ షోతో న‌టి పూజా రామ‌చంద్ర‌న్ టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గరైంది.ఈ అమ్మ‌డు లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా, దోచేయ్, గంగ,కృష్ణార్జున యుద్ధం, త్రిపుర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అల‌రించింది. ఇక ‘బిగ్ బాస్ 2′(తెలుగు)తో ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ కూడా అంద‌రికి సుప‌ర‌చితమే. ఈ అమ్మ‌డు 2010లో విజె క్రేప్గ్ ను పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ళు కొన్ని కారణాల వల్ల 2017లో విడిపోగా, అనంత‌రం జాన్ కొక్కెన్ అనే తమిళ నటుడిని ప్రేమించి 2019 లో పెళ్లి చేసుకుంది.

bigg-boss-contestant-announced-her-pregnancy
bigg-boss-contestant-announced-her-pregnancy

Bigg Boss 6 Telugu : విషెస్ వెల్లువ‌..

సార్పట్ట’ సినిమాలో ఆర్యకు పోటీదారుడిగా న‌టించాడు జాన్. ఇత‌గాడు కూడా పూజా కంటే ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇతను కూడా కొన్ని కారణాల వల్ల తన మొదటి భార్యతో విడిపోయి పూజా రామచంద్రన్ ని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు పూజా ప్రెగ్నెంట్ అట. త్వరలో తల్లి కాబోతున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది పూజా. బాలీవుడ్ స్టైల్ లో భర్తకు లిప్ లాక్ ఇస్తూ ఈ విషయాన్ని తెలియ‌జేసి నానా ర‌చ్చ చేసింద‌నే చెప్పాలి.

భార్య, భర్తల మధ్య ఉన్న అన్యోన్యాన్ని..తల్లిదండ్రులుగా మారుతున్నామే సంతోషాన్ని చూపించే విధంగా ఇద్దరూ కలిసి ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తాను ప్రెగ్నెంట్‌ని అనే విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవడంతో పాటు ఎన్నో భావోద్వేగాల మా జర్నీ మరో కీలక దశకు చేరిందని త‌న పోస్ట్‌లో తెలియ‌జేసింది పూజా . రాబోయే కొత్త సంవత్సవరంలో తమ కుటుంబంలోకి మరో వ్యక్తి వస్తున్నారని చాలా సంతోషంగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఇప్పుడు ఆమెకు ప్రతి ఒక్క‌రు శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నారు.