Hair Tips : బట్టతల అని బాధపడుతూ కూర్చోకుండా ఈ చిట్కాలు ఒకసారి వాడి చూడండి – దెబ్బకి సెట్ అవుతుంది.!

Hair Tips : బట్టతల మన అందాన్ని దెబ్బతీయడంతో పాటు మానసికంగా కూడా కృంగతీస్తుంది.. లైఫ్ స్టైల్ లో ఆకస్మిక మార్పులు, బిజీ వర్క్ లైఫ్, ఎండలో ఎక్కువగా తిరగడం, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, గాఢత ఎక్కువగా ఉండే షాంపూలను ఉపయోగించటం బట్టతల రావడానికి కారణాలు.. ఈ సమస్యను అధిగమించాలంటే ఈ సింపుల్ చిట్కాలను ప్రయత్నించండి.

this-remides-re-hair-growth-on-blad-fore-head

నల్ల మిరియాలు బ్లడ్ సర్క్యులేషన్ ను పెంపొందించడంలో సహాయపడుతుంది. దాంతో జుట్టు బాగా పెరుగుతుంది. బట్టతల సమస్యతో బాధపడుతున్న వారు రెండు చెంచాల మిరియాల పొడిని తీసుకొని అందులో తగినంత నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బట్టతల ఉన్న చోట రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

హెయిర్ గ్రోత్ ను పెంచే సల్ఫర్ ఉల్లిపాయలో ఉంది. ఉల్లిపాయ రసాన్ని బట్టతల ఉన్న చోట రాసుకుంటే కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది. కొబ్బరి పాలు జుట్టు పెరగడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఒక కప్పు కొబ్బరి పాలలో ఒక చెంచా తేనె కలిపి జుట్టు, బట్టతల ఉన్నచోట రాసుకోవాలి. ఆ తరువాత సాధారణ నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. బట్టతల సమస్యతో బాధపడుతున్న వారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే షాంపులను వాడాలి. కోడిగుడ్డు తెల్లసోన లో ఒక చెంచా ఆలివ్ ఆయిల్, రెండు చెంచాలు నిమ్మరసం కలిపి బాగా తిప్పాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి బట్టతల ఉన్నచోట కూడా రాసుకోవాలి. ఆ తర్వాత గాడత తక్కువగా ఉన్న షాంపుతో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకి తగినంత ప్రోటీన్ అందించడంతో పాటు కొత్త జుట్టు రావడానికి కూడా సహాయపడుతుంది