Daily Astrology : రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి దూర ప్రయాణాలు లభిస్తాయి…! 

Daily Astrology :  మేషం:
వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులు ప్రవర్తన వల్ల మానసికంగా సమస్యలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వ్యాపారాలు మందగిస్తాయి.

Today horoscope.. these zoadic signs of peoples are enjoy a lot with long drive..!
Today horoscope.. these zoadic signs of peoples are enjoy a lot with long drive..!

వృషభం:
ధన , ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి నివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో భాగస్తులతో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభకార్యాలు అందుతాయి.

మిధునం:
చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం లభించదు. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు కూడా అందుకుంటారు.

కర్కాటకం:
నిరుద్యోగుల ఆశలకు చిగురులు మొలుస్తాయి. వృత్తి ఉద్యోగాలు మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

సింహం:
వ్యాపారాలు అంతంతమాత్రంగానే సాగుతాయి. ఆర్థిక పరంగా ఒత్తిడి పెరుగుతుంది..వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆకారణ వివాదాలు కలుగుతాయి.

కన్య:
చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు, వ్యాపారాలు మీకు లాభాన్ని అందిస్తాయి.

తుల:
వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం:
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగంలో అంతంత మాత్రంగానే సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ధనస్సు:
అకారణంగా ఇతరులతో వివాదాలు ఏర్పడతాయి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థాన చలన సూచనలు కల్పిస్తున్నాయి. సంతాన విద్యా విషయంపై దృష్టి సారించండి.

మకరం:
కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. దీర్ఘకాలిక రుణాల వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఉద్యోగమున అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు.

కుంభం:
వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగిపోతాయి.

మీనం:
ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప ఇబ్బందులు ఏర్పడతాయి. నూతన రుణాయత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దలు సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత అనుకూలంగా సాగుతాయి.