Heroines : ఒక సినిమాకి హీరో ఎంత ప్రాణమో, హీరోయిన్ కూడా అంతే. ఒకప్పుడు హీరోయిన్స్‌కి చాలా ప్రాధాన్యత ఇచ్చే వారు. నాలుగు స్టెప్స్ కోసం అన్నట్టు కాకుండా కథలో కీలకంగా వ్యవహరించేలా వారి పాత్రలు ఉండేవి. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ గ్లామర్ ఆరబోతతో పాటు హీరోలతో డ్యాన్స్ లు వేసేందుకు అన్నట్టుగానే ఉంటుంది. అయితే అన్ని సినిమాలు అలా అని చెప్పలేం. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలలో హీరోయిన్స్‌కి గట్టి పాత్రలు పడుతున్నాయి. అలాంటి సమయంలో కథానాయికలు తమ సత్తా చూపిస్తున్నారు. బొమ్మరిల్లు లో హాసిని, ఫిదా లో భానుమతి పాత్రలలు సినిమాకి ప్రాణంగా నిలిచాయి. ఇక కొందరు హీరోయిన్స్ చేయాల్సిన దాని కన్నా కాస్త ఎక్కువ ఓవారాక్షన్ చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. ఆ పాత్రల వల్ల కొన్ని సార్లు సినిమా ఫలితమే మారిపోయింది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం
1. జెనీలియా –ఆరెంజ్ బొమ్మరిల్లు చిత్రంలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్న జెనీలియా.. ఆరెంజ్ చిత్రంలో తేలిపోయింది. బ్రహ్మానందంతో వచ్చే సీన్స్ ప్రేక్షకులకి తెగ బోర్ కొట్టించాయంటే అర్ధం చేసుకోండి.
2 రష్మిక- పుష్ప : పుష్ప చిత్రలో శ్రీవల్లిగా నటించిన రష్మిక నేషనల్ క్రష్‌గా మారింది. అయితే ఈ మూవీలోని రష్మిక కొన్ని సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్టుగానే ఉంటాయి. ఎందుకు తీసుకున్నారురా అనే భావన ప్రేక్షకులలో కలుగుతుంది.
3. మెహ్రీన్ – ఎఫ్ 2 : వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఎఫ్ 2 చిత్రం బ్లాక్ బస్టర్ కాగా, ఇందులో అన్ని పాత్రలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతాయి. మెహ్రీన్ చేసిన హనీ పాత్రను మాత్రం అస్సలు భరించలేం.
4. పూజ హెగ్డే- మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ : విజయాల కోసం ఆరాటపడుతున్న సమయంలో అఖిల్‌కి మంచి హిట్ అందించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, ఆమె వల్లనే సినిమా హిట్ అయిందని అన్నారు. అయితే ఇందులో పూజా పాత్ర కాస్త అతిగా అనిపిస్తుంది.
5. రష్మిక – సరిలేరు నీకెవ్వరూ : అనిల్ రావిపూడి మహేష్ కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్ డూపర్ హిట్ కాగా, ఇందులో రష్మిక ఐ ఆమ్ ఇంప్రెస్స్డ్ అంటూ చేసే అల్లరి ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తుంటుంది.
6. కేతిక శర్మ- రొమాంటిక్ : పూరి తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్గా నటించగా,ఈ మూవీ ఆమె డెబ్యూ చిత్రం. అయితే ఇందులో కేతిక ఓవరాక్షన్ చాలా చిరాకు తెప్పిస్తుంది.
7. రాశి ఖన్నా – పక్కా కమర్షియల్ : గోపీచంద్ , రాసి ఖన్నా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇందులో రాశిఖన్నా పాత్ర అంత ఇంప్రెసివ్ గా అనిపించదు.
8. కీర్తి సురేష్ – రంగ్ దే : మహానటితో ఫుల్‌గా ఇంప్రెస్ చేసిన కీర్తి సురేష్.. నితిన్ హీరోగా తెరకెక్కిన రంగ్ దే చిత్రంలో తేలిపోయింది. ఆమె పాత్రకి ఎవరు కూడా కనెక్ట్ కాలేకపోయారు.
9. అనన్య పాండే – లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా పూరీ తెరకెకకించిన చిత్రం లైగర్. ఈ సినిమాతో అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఇందులో అనన్య పాత్ర బెడిసికొట్టింది.
10. రాశి ఖన్నా – వరల్డ్ ఫేమస్ లవర్ ; విజయ్ దేవరకొండ తో రాశి ఖన్నా చేసిన ఈ చిత్రం దారుణంగా నిరాశపరచింది. ఇందులో రాశి పాత్ర చాలా నీరసంగా సాగుతుండడంతో పాటు ప్రేక్షకులకి చిరాకు తెప్పిస్తుంది.