Breaking : గ్రూప్ -1 పైన కీలక ప్రకటన..!

Breaking : TSPSC గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.. 503 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదలవగా లక్షల సంఖ్యలో అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.. ఈనెల 16న ఈ గ్రూప్ వన్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.. అయితే ఈ పరీక్షలలో ఏవేవో అవకతవకలు జరిగియని సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి.. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని వార్తలు వచ్చాయి.. అయితే ఈ వార్తలపై తెలంగాణ సర్కార్ స్పందించింది..! తాజాగా గ్రూప్ వన్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..!

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని TSPSC వెల్లడించింది.. ఏ పరీక్ష కేంద్రంలోనూ ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోలేదని తెలిపింది.. కొన్నిచోట్ల గందరగోళం కారణంగా అభ్యర్థులు నష్టపోయిన సమయాన్ని మాత్రం అదనంగా ఇచ్చినట్లు పేర్కొంది.. ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే .. ఇన్విజిలేటర్ల పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.. ఫేక్ వార్తలను అభ్యర్థులు నమ్మొద్దు అని తెలంగాణ సర్కార్ సూచించింది..

Telangana government take decision on group 1 exams
Telangana government take decision on group 1 exams

4 రోజుల క్రితం తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ పరీక్ష జరిగే రోజు ఉదయం 10:15 నిమిషాలు దాటితే పరీక్ష హాలు లోకి ఎలా చేయమని చెప్పారు.. 503 పోస్టులకు గాను 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ పరీక్ష కోసం 1019 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్లు మూసివేశారు.. గ్రూప్ వన్ పరీక్షల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు.. అయితే ఈ గ్రూప్ వన్ పరీక్షలపై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి ఈ విషయంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది..