Bigg Boss 6 Telugu : హౌస్ లో ఏడుస్తోన్న శ్రీహన్ వీడియో ఇంట్లో టీవీలో చూసి ఎక్కి ఎక్కి ఏడ్చిన సిరి హన్మంత్ !

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సోమవారం వచ్చిందంటే గొడవలు వస్తుంటాయి.. ఆ తర్వాత రోజు అంతా కామన్ అయిపోతారు. ఇక వీక్ మధ్యలో బిగ్ బాస్ వాళ్ళతో ఆడుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నామినేషన్స్ తర్వాత వేడిగా ఉన్న వాతావరణాన్ని మరింత హీట్ ఎక్కించాడు బిగ్ బాస్. ఈ సారి వాళ్లకు ఎమోషనల్ టాస్క్ ఇచ్చాడు. సాధారణంగా నెత్తిమీద నీళ్లకుండలు పెట్టుకుని ఉండే మన కంటెస్టెంట్స్ ఇప్పుడు మరింతగా రెచ్చిపోయారు.. కన్నీళ్ళ ధారలు కురిసాయి. శ్రీహాన్ అయితే చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు.. పాపం ఆయన్ని చూసి ఇంటి దగ్గర సిరి కూడా కన్నీటి ధారలు కురిపించిందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఎప్పుడెలాంటి టాస్కులు ఇస్తాడో ఊహించడం కష్టమే.

ఈ వారం కూడా ఇదే చేసాడు ఈయన. ఈ సారి బ్యాటరీ రీచార్జ్ అంటూ మరో కొత్త కాన్సెప్టుతో వచ్చాడు బిగ్ బాస్. అందులో భాగంగానే ఇంటి సభ్యులను ఏడిపించడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఏడవరు అనుకున్న వాళ్లతో కూడా కన్నీరు పెట్టించే వరకు వదల్లేదు బిగ్ బాస్. కొందరు సభ్యులను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి.. వాళ్లకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి.. దానికోసం బ్యాటరీలో కొంత భాగం ఇచ్చేయాలని ఆదేశించాడు బిగ్ బాస్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది చేయాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. అందులో శ్రీహాన్‌ను ముందుగా పిలిచిన బిగ్ బాస్.. అతడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసాడు. శ్రీహాన్‌ని క‌న్ఫెష‌న్‌ రూమ్‌కు పిలిచిన తర్వాత.. అతడికి ఇష్టమైన వ్యక్తులకు వీడియో కాల్.. ఆడియో మెసేజ్.. ఫుడ్.. ఇలా మూడు రకాల ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో కచ్చితంగా ఒక ఆప్షన్‌ని తీసుకోవాలి..

Bigg Boss 6 Telugu Siri Hanumanth cried after seeing video of Shrihan
Bigg Boss 6 Telugu Siri Hanumanth cried after seeing video of Shrihan

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఏం చేసాడంటే…?

అప్పుడు వాళ్ల బ్యాటరీలో ఉన్న రీచార్జ్ తగ్గిపోతుంది. తనకు ఏ ఆప్షన్ వద్దు.. ఇంట్లో వాళ్లకు ఇస్తాను అని శ్రీహాన్ చెప్పినా కూడా బిగ్ బాస్ ఒప్పుకోలేదు. అలా చేయకపోతే ఇంటి మొత్తానికి ఆ పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడంతో.. పాపం మనోడు చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు. సిరితో మాట్లాడాలని ఎంత అనుకున్నా కూడా కంట్రోల్ చేసుకున్నాడు. చివరికి మరో దారి లేక 15 శాతం బ్యాటరీ ఇచ్చి ఇంటి నుంచి అమ్మచేతి మటన్ బిర్యానీ తెప్పించుకున్నాడు. శ్రీహాన్ ఎంచుకున్న ఆప్షన్ వల్ల బ్యాటరీ రీచార్జ్ 15 పర్సంట్ పడిపోయింది. ఆ దెబ్బతో ఇంటి సభ్యులంతా షాక్ అయ్యారు.. శ్రీహాన్ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లిన సుదీప ఏకంగా 30 శాతం బ్యాటరీ తీసుకుంది. ఇక్కడ శ్రీహాన్ ఏడుపు చూసి ఇంటి దగ్గర టీవీ చూస్తూ సిరి కూడా కన్నీరు పెట్టుకుందని తెలుస్తుంది.