Nayanthara : అద్దె గర్భం – సరోగసి విషయం లో ఇదే జరిగితే .. నయనతార కీ ఆమె భర్తకీ జైలు గ్యారెంటీ ?

Nayanthara  : నయనతార.. విగ్నేష్ శివన్ జీవితంలోకి ఇద్దరు కవల పిల్లలు వచ్చారు అని ఆనందించాలో లేక సరోగసి ద్వారా జన్మించడం వల్ల వీరి ఇరువురికి జైలు శిక్ష పడుతుంది అని చింతించాలో తెలియదు కానీ .. దారిన పోయే దరిద్రాన్ని తలపైకి తెచ్చుకోవడం అంటే ఇదే అని వీరి జీవితంలో స్పష్టం అవుతోంది.. లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార.. ఇటీవల జూన్ 9వ తేదీన మహాబలిపురంలోని ఒక రిసార్ట్లో చాలా గ్రాండ్గా డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. పెళ్లి అనే బంధంతో ఒకటైన ఈ జంట ప్రస్తుతం బిజీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే హనీమూన్ ని కూడా ఎంజాయ్ చేసి వచ్చిన ఈ జంట ప్రస్తుతం తమ సినిమాల విషయంలో ఎవరికి వారు బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అన్యోన్యంగా ఉన్న ఈ జంట త్వరలోనే అందరికీ ఒక శుభవార్త చెబుతారని భావించారు.. కానీ ఎవరు ఊహించని విధంగా శుభవార్త చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదేమిటంటే పెళ్లైన నాలుగు నెలలకి అది కూడా ఇద్దరూ కవల మగ బిడ్డలకు జన్మనిచ్చి షాకింగ్ పోస్ట్ చేయడంతో ఈ విషయాన్ని సంతోషపడాలో.. లేక ఇలా నాలుగు నెలలకే ఇద్దరు కవల పిల్లలు జన్మించడం చూసి ఆశ్చర్యపోవాలో తెలియక ఎవరికి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం వీరికి శుభాభినందనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త ప్రకారం నయనతార , విగ్నేష్ సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం.అయితే ఇదే విషయంపై ప్రముఖ నటి కస్తూరి ఇండియాలో సరోగసి బ్యాన్ చేసిన విషయాన్ని జ్ఞప్తికి తీసుకొచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఇండియాలో సరోగసి రూలు బ్యాన్ చేశారు.

Nayanthara Vignesh Shivan Jail Guarantee
Nayanthara Vignesh Shivan Jail Guarantee

అయితే భార్యకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పిస్తే ఇలాంటి పద్ధతికి ప్రభుత్వం అనుమతించడం లేదు. మరీ ముఖ్యంగా విగ్నేష్ ఎందుకు సరోగసి ప్రాసెస్ ద్వారా పిల్లలను కనడానికి అంగీకరించారు? వీళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఇదే విషయంపై తమిళనాడు గవర్నమెంట్ కూడా సీరియస్ అయ్యింది. స్టార్ జంట అయినటువంటి వీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎందుకు సరోగసి ప్రాసెస్ కి అప్రోచ్ అయ్యారు? గవర్నమెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో అల్లాడిపోతున్నారు. ఇకపోతే వీరు ఇల్లీగల్ గా సరోగసి ప్రాసెస్ చేసి ఉంటే మాత్రం తమిళనాడు ప్రభుత్వం ప్రకారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారేంటి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయినా సరే ఈ విషయంపై ఎటువంటి వ్యత్యాసం చూపించమని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. ఈ దంపతులు ఎలాంటి వివరణ ఇస్తారో తెలియాల్సి ఉంది.