Samantha : చాలా చాలా థాంక్స్ అక్కా.. సమంత కి థాంక్స్ చేప్తోన్న విజయ్ దేవరకొండ అభిమానులు.!

Samantha : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి.. శివా నిర్వాణ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలై వాయిదా పడిన సంగతి తెలిసిందే.. సమంతా అందుబాటులో లేనందున ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..! సమంత స్కిన్ ఎలర్జీ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతుందని..

ఇందుకు సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ఆమె అమెరికా వెళ్లిందని ఆ మధ్య వార్తలు జోరుగా ప్రచారం జరిగయి. అయితే ఆ వార్తలపై సమంత టీం స్పందించి ఆ వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు.. ఇటీవల సమంత యూఎస్ టూర్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.. ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ తో సూపర్ సక్సస్ అందుకున్న సమంత.. రాజ్ అండ్ డీకె లతో కలిసి సీటాడెల్ వెబ్ సిరీస్ కు సిద్ధమవుతుందట.

Vijay Deverakonda fans thanking Samantha
Vijay Deverakonda fans thanking Samantha

డిసెంబర్ లో ఈ సీరీస్ సెట్స్ పైకి వెళ్లనుంది.. విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటిస్తున్న సమంత ఈ సినిమా తాజా షెడ్యూల్ ను స్టార్ట్ చేసి అందులో కీలక ఘట్టాల చిత్రీకరణలో సమంత పాల్గొనుంది. ఆ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభం కానుందని తెలిసిన విజయ్ ఫ్యాన్స్ చాలా చాలా థాంక్స్ అక్కా.. అని సమంత కి థాంక్స్ చెబుతున్నారు..