Smart Phone 200MP camera : 180 W , 200 MP కెమెరా. మరెన్నో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..! 

Smart Phone 200MP camera ఈ మధ్యకాలంలో వరుసగా అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎన్నో ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ కంపెనీ ఇన్ఫినిక్స్ కూడా తాజాగా తమ కంపెనీ నుంచి ఒక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ముఖ్యంగా ఇన్ఫినిక్స్ ఇప్పటివరకు కూడా దాదాపుగా బడ్జెట్ ధరల చుట్టూనే తన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ పైన కూడా కన్నేసినట్లు సమాచారం. ఎందుకంటే 200 మెగాపిక్సల్ కెమెరాతో పాటు 180W ఛార్జింగ్ సపోర్ట్ తో భారీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది.

ఇకపోతే ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5G పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అన్ని విభాగాలలో కూడా భారీ స్పెసిఫికేషన్స్ ను కలిగి ఉంది. 6.82 అంగుళాలు 3D AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాదు గేమింగ్, స్పోర్ట్స్ కంటెంట్ కోసం ఉపయోగకరమైన ఈ డిస్ప్లే 120 HZ రీఫ్రెష్ రేట్ సపోర్టుతో లభిస్తుంది. అంతేకాదు వేగవంతమైన మీడియా టెక్ డైమన్ సిటీ 920 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే.. 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ కెపాసిటీ తో లభిస్తుంది. జీరో అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంది.

180 W , 200 MP camera. New smartphone launch with many more amazing features
180 W , 200 MP camera. New smartphone launch with many more amazing features

200MP ప్రధాన కెమెరా కి అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ కూడా జత చేయబడ్డాయి . సెల్ఫీ కోసం 32 మెగా ఫిక్సల్ కెమెరాను అమర్చారు. అంతేకాదు 180 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4610 కూడా కలిగి ఉంటుంది. ఈ కేవలం 12 నిమిషాల్లోనే 100% చార్జింగ్ పూర్తవుతుంది . అయితే ధరలు త్వరలోనే ప్రకటిస్తాము అని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయబడిన ఈ స్మార్ట్ ఫోన్ విలువ 520 డాలర్స్ గా నిర్ణయించారు.