Singer Sunitha : సింగర్ సునీత కరెక్ట్ వయసు ఎంతో తెలుసా మీకు ? ఏ ఊర్లో పుట్టిందో తెలుసా అసలు?

Singer Sunitha : ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో కుతూహలం చూపిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే కేవలం నటీనటుల జీవితాల గురించే కాదు దర్శక నిర్మాతలు, సింగర్స్ ఇలా బాగా పాపులారిటీని సంపాదించుకున్న వారందరి జీవిత విషయాల గురించి.. అలాగే వారు ఎక్కడ పుట్టారు? వారి బాల్యం ఎలా సాగింది? ఇలా ప్రతి విషయాలను కూడా తెలుసుకోవడానికి తన ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే వేలాది ప్రేక్షక ఆదరణ పొందిన ప్రముఖ సింగర్ సునీత గురించి కూడా తెలుసుకోవడానికి ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి సింగర్ సునీత చాలా యంగ్ గా కనిపిస్తుంటుంది. నేటితరం హీరోయిన్లతో సమానంగా అందంతో, అభినయంతో ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ ఒక నవ్వు నవ్వింది అంటే చాలు సినీ లోకం ఫిదా అవ్వాల్సిందే అంత అద్భుతంగా వుంటుంది ఈమె నవ్వు..

ఆ కట్టు.. బట్టు.. సాంప్రదాయం .. అబ్బో ఒక్కటేమిటి.. సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం సునీత అని చెప్పవచ్చు.. గులాబీ సినిమా ద్వారా “ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో ” అంటూ యావత్ తెలుగు అభిమానులను ఒక్క పాటతో మైమరిపింపచేసి టాప్ సింగర్ గా ఎదిగిపోయింది. 15 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీకి గాయనిగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పాటలు పాడడమే కాదు ఎంతోమంది హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెప్పింది. 1978 మే 10వ తేదీన గుంటూరులో జన్మించిన సునీత తన విద్యాభ్యాసాన్ని గుంటూరు మరియు విజయవాడలో పూర్తి చేసింది. సంగీతం మీద ఆసక్తితో విజయవాడలో సంగీతం నేర్చుకుంది. లేత అందాలతో మేని ఛాయతో ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. వయసు 44 సంవత్సరాలు.. సునీతకు ఇంత వయసు ఉందంటే ఎవరైనా నమ్మగలరా? నమ్మసక్యం కాకపోయినా ఆమె వయసు ఇంతే.. ఇక సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా ఉన్న సునీతకు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

Do you know the correct age of singer Sunitha
Do you know the correct age of singer Sunitha

కానీ ఆమె సున్నితంగా తిరస్కరించిందని చిన్నపాటి రూమర్స్ కూడా అప్పుడప్పుడు గాలివానలా వినిపిస్తూ ఉంటాయి. ఇక దాదాపు 3,500 పైగా పాటలు పాడి తన గాత్రంతో శ్రోతలను అలరించిన సునీత తన సంగీత ప్రయాణంలో ఇప్పటివరకు 9 నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం తో ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్న సునీత.. ఆయన కుటుంబంతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఇక వీరిద్దరూ కలసి ఎన్నో పాటలు కూడా పాడారు. ముఖ్యంగా సునీతను ప్రోత్సహించడంలో బాలు మొదటి పాత్ర పోషించారు. కుటుంబ సభ్యుల సలహా మేరకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ ను వివాహం చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తూ వచ్చింది. ఇటీవల మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని 2021 జనవరిలో రెండవ వివాహం చేసుకొని వైవాహిక జీవితాన్ని సంతోషంగా సాగిస్తోంది.