Laddus : ఈ లడ్డూలు కనుక చేస్తే సాయంత్రం పూట మీ పిల్లలు ఇష్టంగా తింటారు!

Laddus : రకాల లాభాలను పొందవచ్చు. ఒక‌ప్పుడు ఇవి అన్ని కాలాల‌లో దొర‌క‌క పోయినా ప్ర‌స్తుతం సంవ‌త్స‌రం పొడ‌వునా మ‌న‌కు మార్కెట్‌లో అభిస్తుంటాయి. వీటిలో అనేక‌ పోషకాలు శక్తి మెండుగా లభిస్తాయి. కొంద‌రు వీటిని తిన‌డానికి అంత‌గా ఇష్టప‌డ‌రు. అలాంటివారు వీటిని ల‌డ్డూల మాదిరి చేసుకుని రెండు మాడు వారాల వ‌ర‌కు స్టోర్ చేసుకుని తినొచ్చు. అయితే రాగులను ,ఖర్జూరాలను ఉపయోగించి తయారు చేసేటువంటి లడ్డూలు ఎంతో బలాన్ని ఇస్తాయ‌ని వైద్యులు కూడా దృవీక‌రించారు. కావున వీటిని మనం రోజు తింటే ఎంతో మంచిది. ఇక రాగులతో, ఖర్జూరాలతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖర్జూరాలు, రాగుల లడ్డూలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..

1 కప్పు- రాగులను వేయించి పొడి చేయాలి,1 కప్పు- గింజలు లేని ఖర్జూరాలను సన్నగా కట్ చేయాలి, యాలకుల పొడి, నెయ్యి, ఎండు కొబ్బరి పొడి , తగినంత- జీడిపప్పు

If you make these laddu , your kids will love to eat them in the evening
If you make these laddu , your kids will love to eat them in the evening

Laddus  : ఖర్జూరాలు, రాగుల లడ్డూలను తయారు చేసే విధానం..

ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రాగి పిండిని వేసి దీనిలో నెయ్యిని వేసి కలపాలి. ఇందులో కొబ్బరి పొడి, యాలకుల పొడి, కట్ చేసిన డేట్స్ ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. చుట్టుకున్న లడ్డూలపై జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఇంతే.. చాలా రుచికరమైన ఖర్జూరాలు ,రాగుల లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలను నిల్వ చేస్తే పది రోజుల వరకు తాజాగా ఉంటాయి. రోజుకు ఈ లడ్డూలను ఒకటి చొప్పున తినాలి. వీటిని తినడం వల్ల చాలా బలం కలుగుతుంది. ఈ లడ్డులలో చాలా రకాల పోషకాలు మనకు లభిస్తాయి. చిన్నపిల్లలకు ఈ లడ్డూలను ఇస్తే ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పిల్లలకు తెలివితేటలు కూడా పెరుగుతాయి. చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. పెద్దవాళ్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగే వ్యాధులు తగ్గుముఖం పడతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. ఈ లడ్డూలను తినడం వల్ల రోజంతా మనకు యాక్టివ్ గా ఉంటుంది. చురుగ్గా కూడా పని చేస్తారు. అందువలన రోజుకు ఈ లడ్డులను ఒకటి చొప్పున తింటూ ఉండాలి.