Jio 5G offers : కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే 5G సేవలు..!! 

Jio 5G offers : గత కొన్ని నెలల నుంచి 5G సేవలు తీసుకొచ్చే ప్రయత్నంలో పలు టెలికాం దిగ్గజ సంస్థలు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా చలామణి అవుతున్న రిలయన్స్ జియో తాజాగా 5G సేవల విషయంలో కీలక ప్రకటన చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అక్టోబర్ నుంచి 5G సేవలను ఎంపిక చేసిన ప్రధాన నగరాలలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన జియో.. చెప్పిన మాట ప్రకారమే అక్టోబర్ 5వ తేదీ నుంచి దేశంలోని నాలుగు ప్రధాన నగరాలలో 5G బీటా సేవలను ప్రారంభించింది. అయితే ఈ సేవలు ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయని కూడా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Jio 5G offers : Jio good news for customers.. 5G services at lowest price
Jio 5G offers : Jio good news for customers.. 5G services at lowest price

ఇకపోతే ఢిల్లీ, ముంబై, కోల్ కతా , వారణాసిలో మొదలయ్యే తమ 5G సర్వీసులను ఉపయోగించుకునేందుకు జియో ట్రూ 5G వెల్కం ఆఫర్ పేరుతో కొంతమంది కస్టమర్లకు ఆహ్వానాలను కూడా పంపిస్తోంది. ఇలా ఇన్విటేషన్ కోడ్ పొందిన కస్టమర్లు మాత్రమే 5G సేవలను పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే జియో కస్టమర్లు 4G నుంచి 5G సేవలను పొందడానికి సిమ్ కార్డ్ కానీ, 5G హ్యాండ్ సెట్ కానీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిగ్గా 5G సర్వీసులకు అప్డేట్ అవుతుందని కూడా ప్రకటించింది. ఈ సేవలను ఉపయోగించుకోవడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

ఇక యూజర్లు వారి ప్రస్తుత 4G ప్లాన్ ప్రకారమే టారిఫ్ చెల్లిస్తే చాలు అని, ట్రైల్ సందర్భంగా 5G డేటాకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు అని కూడా జియో స్పష్టం చేసింది. అయితే కనీస రీఛార్జ్ తప్పనిసరి అంటూ ఒక షరతులు పెట్టింది. నెలవారి రీఛార్జి లాగా 239 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 5G డేటాను 4G డేటా లాగే పొందవచ్చు. రూ.239 కంటే ఎక్కువ ధరల ప్లాన్లను ఎంచుకున్న వారే జియో 5G వెల్కం ఆఫర్ ప్రయోజనాలను పొందుతారు. వీరికి సెకండ్ కి ఒక గిగాబైట్ స్పీడ్ తో అన్లిమిటెడ్ 5Gడేటా లభిస్తుంది. ఈ చర్యతో సగటు ఆదాయాన్ని పెంచుకోవచ్చు అన్నది జియో యొక్క అభిప్రాయం. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5G సేవలను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని జియో ప్రకటించింది.