Trivikram : డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ‘ ఆ మ్యాటర్ ‘ లీక్ అయ్యింది .. ఇండస్ట్రీ మొత్తం ఇదే టాక్

Trivikram : తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో సమానంగా ఈయన మార్కెట్ సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా హీరో ఎవరనే సంబంధం లేకుండా త్రివిక్రమ్ సినిమా వచ్చింది అంటే చాలు కలెక్షన్ల పంట పండుతుంది. తాజాగా ఈయన గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ లీక్ అయింది. త్రివిక్రమ్ ఇకపై తన కెరీర్ ప్లానింగ్ మార్చుకుంటున్నాడని.. ఇప్పట్నుంచి చేసే సినిమాల విషయంలో గురూజీ వర్కింగ్ స్టైల్ అంతా మారిపోతుందని తెలుస్తుంది. పైగా దీనికి ఓ అగ్ర నిర్మాత అండగా ఉండబోతున్నాడు. ఆ మ్యాటర్ తెలిసిన తర్వాత అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. రాజమౌళి రేంజ్‌లో ఈయన కూడా వెళ్లాలంటే అది చేయక తప్పదంటున్నారు.

కేవలం తన మాటల చాతుర్యంతో.. దర్శకత్వ ప్రతిభతో యావరేజ్ సినిమాను కూడా సూపర్ హిట్ చేయగల సత్తా ఈయన సొంతం. అందుకే ఆయన్ని అంతా గురూజీ అంటారు. ఈయన ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తుంటారు. మీడియం బడ్జెట్ హీరోల జోలికి కూడా వెళ్లడు. తన కెరీర్ మొత్తంలో త్రివిక్రమ్ చేసిన రెండు మీడియం బడ్జెట్ సినిమాలు కేవలం నితిన్, తరుణ్ తో మాత్రమే. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ కోసం అంతా ప్రిపేర్ చేస్తుండగా మహేష్ బాబు అమ్మగారు మరణించడంతో అనుకోకుండా అది వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఓ వైపు దర్శకత్వంతో పాటు మరోవైపు నిర్మాణ రంగంలోనూ బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. హారిక హాసిని క్రియేషన్స్‌తో గత కొన్నేళ్లుగా ఆయన కూడా జర్నీ చేస్తున్నాడు. అందులో అతడికి కూడా భాగస్వామ్యం ఉంది.

trivikram-news-leaked
trivikram-news-leaked

ఆ కల ఎప్పటిదో..?

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎప్పటినుంచో ఒక కోరిక అలాగే ఉండిపోయింది. తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన రాజమౌళి రేంజ్ ఈ రోజు ప్రపంచమంతా తెలిసేలా ఉంది. అందుకే తాను కూడా అదే రేంజ్ కి వెళ్లాలని ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్. దానికోసం ఇలా తెలుగు సినిమాలు చేస్తే సరిపోదని.. పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేయాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోల కోసం పాన్ ఇండియా కథలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ.. ఎప్పటికైనా తన నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ తీస్తాను అంటున్నాడు. త్రివిక్రమ్ కూడా ఇకపై చేసే ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇంత టాలెంట్ ఉండి మాటలతోనే మాయ చేయగల త్రివిక్రమ్.. కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కావడం ఆయన అభిమానులకు కూడా నచ్చడం లేదు. మరి ఈయన చేయబోయే ఫ్యూచర్ సినిమాలు ఎలా ఉంటాయో.. పాన్ ఇండియా వైడ్ గా అవి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.