Karthika Deepam : దీప నా భార్యన్న కార్తీక్.. మోనిత కు చుక్కలు చూపిస్తున్న దీప, దుర్గ..

Karthika Deepam : నామీద నీకు నమ్మకం ఉంది కదా చూస్తుందంత అబద్ధం అని నమ్ముతావు కదా అని మోనిత కార్తీక్ ని అడుగుతుంది.. ఏది నిజమో ఏది అబద్దమో తెలియటం లేదు అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో క్లారిటీగా చెప్పు అని కార్తీక్ అడుగుతాడు.. నువ్వు దుర్గ చెప్పినవన్నీ నిజమైన నమ్ముతున్నావేమోనని భయంగా ఉంది అని మోనిత అంటుంది.. ఎవరైనా భయపడుతున్నారు అంటే తప్పు చేస్తున్నారు అనే కదా అర్థం మోనిత అని కార్తీక్ అంటాడు.. అదిగో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని మోనిత ఫీల్ అవుతుంది.. మరి ఆ దుర్గ అంత చేస్తున్న నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నవు.. నేను ఏ తప్పూ చేయలేదు కార్తీక్.. అంటూ మోనిత ఏడుస్తుంది.. అప్పుడే కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చి.. నీ కడుపులో పెరిగే బిడ్డకు నేను తండ్రిని కాదు.. అని పెద్దగా అంటాడు కార్తీక్.. ఏమైంది కార్తీక్ అని మోనిత అడుగుతుంది..!

karthika-deepam-deepa-and-durga-twist-to-mounitha
karthika-deepam-deepa-and-durga-twist-to-mounitha

కార్తీక్ దీప భుజం మీద చెయ్యి వేసి నడుచుకుంటూ మౌనిత దగ్గరకు వస్తే తన చంప చల్లుమనిపిస్తాడు.. దీప నా భార్య అని మౌనితతో అంటాడు.. అసలు నువ్వు ఎవరే.. నాకు నా భార్య ను నాకు దూరం చేస్తున్నావా.. నా భార్యను నా నుండి దూరం చేసి ఏం సాధిద్దాం అని అనుకుంటున్నావు.. గతం గుర్తుకు రాకుండా చేసి నన్ను నీ దగ్గరే ఉంచేసుకుందామని అనుకుంటున్నావా.. నోరు ఇంకా నువ్వేమి మాట్లాడకు ఇన్ని గుర్తొచ్చిన నీకు నా ప్రేమ గుర్తుకు రాలేదా కార్తీక్ అని మౌనిత అడుగుతుంది.. ప్రాణాలు పోయినా ఒక మనిషి బ్రతికే ఉన్నాడని తెలిస్తే ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుందో తెలుసా.. నీ స్వార్థం కోసం నా కుటుంబానికి ఆ సంతోషం లేకుండా చేసావు.. నాకోసం వచ్చిన నా భార్యను నాన్న పాట్లు పడేలాగా చేశావు.. నా మతిమరుపు ని అడ్డం పెట్టుకొని నన్నే ఈ తప్పులన్నీ చేసేలాగా చేశావు.. అని మోనిత కలలో నుంచి బయటకు వచ్చి పెద్దగా అరుస్తుంది.. ఇలా ఎప్పటికీ జరగకూడదు అని మోనిత అనుకుంటుంది..

మోనిత కార్తీక్ కి పకోడీ చేసి తీసుకువస్తుంది.. ఆప్పుడు కూడా అంతే కార్తీక్ వర్షం పడ్డప్పుడు నీకు పకోడీ చేసి పెట్టేదానిని.. నువ్వు ఆ వర్షంలో నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని బయటకు తీసుకు వెళ్ళే వాడివి.. ఎంతైనా ఆ రోజులు వేరులే.. అయినా నీకు ఆ రోజులు గుర్తుకు రవుగా అని మోనిత అంటుంది.. నాకు గుర్తుకు వస్తున్నాయి అని కార్తీక్ అంటాడు.. కానీ నువ్వు చెప్పింది ఒక్కటి అంటే ఒక్కటి కూడా గుర్తుకు రావడం లేదు.. నేను ఒక్కడినే సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాను.. అక్కడ నువ్వు అస్సలు లేవు మోనిత అసలు నువ్వు చెప్పేదానికి నాకు గుర్తు వచ్చే దానికి పోలికే ఉండటం లేదు.. నువ్వు ఒకలాగా చెబుతున్నావు నాకు ఇంకొకలాగా గుర్తుకు వస్తుంది.. అని కార్తీక్ అలా బలవంతంగా గతం గుర్తు తెచ్చుకోవద్దు కార్తీక్ అని మౌనిత అంటుంది.. నేనేమీ కావాలనే గతం గుర్తుకు తెచ్చుకోవటం లేదు నువ్వు వర్షం సైకిల్ అనగానే ఆటోమేటిక్ గా అవన్నీ నాకు గుర్తు వచ్చాయి అని కార్తీక్ అంటాడు..

అప్పుడే దుర్గా వచ్చి పకోడీలు తింటూ హే మోనిత ఇది అన్యాయం.. నాకోసం పకోడీలు వేసాను అని చెప్పి అప్పుడే తీసుకొచ్చేసేసావు ఏంటి అని అంటాడు దుర్గ.. నేను నీకు ఎప్పుడు చెప్పాను అని మోనిత అడుగుతుంది.. అదేంటి అరగంట క్రితం కాల్ చేశావు కదా.. నువ్వే ఫోన్ చేసి నన్ను రమ్మన్నావు కదా అని.. దుర్గ తన ఫోన్ లో తన కాంటాక్ట్ లిస్టులో మౌనిత ఫోన్ చేయడం తీసి చూపిస్తాడు.. ఇదంతా అబద్ధం కార్తీక్ నేను ఫోన్ చేయలేదు అని మోనిత అంటుంది.. అయినా నీ ఫోన్ నుంచి నువ్వు కాకపోతే ఎవరు ఫోన్ చేస్తారు అని కార్తీక్ అడుగుతాడు.. మోనిత మనిద్దరి గురించి సార్ కి తెలుసు.. సార్ ఏం తప్పుగా అనుకోరు నువ్వేం కంగారు పడకు అని దుర్గా అంటాడు.. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప కార్తీక్ బర్త్డే విషెస్ చెబుతుంది.. నా జీవితంలో అతిపెద్ద పండుగ ఇదే అని అంటుంది.. మరి నువ్వు ఎందుకు బర్త్డే విషెస్ చెప్పలేదు మోనిత అని కార్తీక్ అడుగుతాడు..