Intinti Gruhlakshmi 04 oct Episode : అది లాస్య ప్లాన్ కదా.!? సామ్రాట్ మామూలోడు కాదు తులసి పై ఇంత పెద్ద కుట్ర చేశాడా.!?

Intinti Gruhlakshmi 04 oct Episode : ఫైల్ నేనే చూసుకోకుండా పెట్టాను మేడం అని ఝాన్సీ అంటుంది.. నేను వెంటనే ఈ విషయం సామ్రాట్ సార్ తో చెబుతాను పదండి మేడం.. సార్ దగ్గరికి వెళ్దామని ఝాన్సీ అంటుంది.. కానీ తను మౌనంగా ఉండిపోతుంది తులసి.. ఇక ఝాన్సీ తన రిసిగ్నేషన్ లెటర్ తీసుకొని సామ్రాట్ ముందు నిలబడుతుంది.. సామ్రాట్ కోపంగా ఝాన్సీ రెసిగ్నషన్ చేస్తాడు.. నేను తప్పు చేసిన ఫీలింగ్ నాకు కలుగుతుంది.. సార్ అని ఝాన్సీ అంటుంది.. నేను చెబితేనే కదా నువ్వు తులసి టేబుల్ పైన ఈ ఫైల్ పెట్టావు.. కాబట్టి నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు అని సామ్రాట్ అంటారు.. నాకు తెలుసు మీరు కూడా ఎందుకు సార్ ఇలా చేశారు అని ఝాన్సీ అడుగుతుంది నేను ఏం చేసినా ఆలోచించే చేస్తాను అని సమ్రాట్ అంటాడు దయచేసి ఈ ఫైల్ విషయం ఇక బయటకు రాకూడదు ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అని సామ్రాట్ రెండు చేతుల్లో ఎత్తి ఝాన్సీ కి దండం పెడతాడు సార్ సరే అంటూ ఝాన్సీ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

సామ్రాట్ వారి ఇంట్లో జరిగే బర్త్డే ఫంక్షన్కు ఇంకా తులసి రాలేదేంటని సామ్రాట్ ఆలోచిస్తూ ఉండడు అప్పుడే వాళ్ళ బాబాయ్ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ఉన్నావు అని అడుగుతాడు.. అప్పుడే తులసి నవ్వుకుంటూ తన వాళ్లతో కలిసి ఇంట్లోకి వస్తుంది ఎవరి కోసం ఎదురుచూస్తున్నారు అని తులసి అడుగగా.. మీకోసమే ఎదురు చూస్తున్నాడమ్మ.. అది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళ బాబాయ్ అంటాడు.. నువ్వు వస్తేనే సామ్రాట్ కి హనీకి ఏ పండగ అయినా అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు.. అప్పుడే లాస్య అక్కడికి వచ్చి తులసి పొద్దున ఆఫీసులో చేసిన ఘనకార్యం గురించి మీకు తెలియదు నందు సామ్రాట్ గారి కంపెనీకి ఎంత ఫేవర్ చేశాడో తెలుసా అని అంటుంది.. తులసి వెంటనే హనీ ని రెడీ చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

intinti-gruhlakshmi plan of lasya samrat serious on tulasi
intinti-gruhlakshmi plan of lasya samrat serious on tulasi

తులసి హనీ ని ముద్దుగా రెడీ చేస్తుంది. నీ కళ్ళకు కాటుగా పెట్టుకోలేదేంటి హనీ.. కళ్ళకు కాటుక పెట్టుకుంటే నువ్వు ఎంత అందంగా ఉంటావో అని అంటూ.. ఏకంగా కళ్ళపై కవిత చెప్పేస్తుంది తులసి.. నీకు దిష్టి కలగకుండా ఉండాలి అంటే నేను నీకు ముద్దు పెట్టేయాలి అంటూ తులసి హనీకి ముద్దుపెడుతుంది.. అదంతా సామ్రాట్ వెనుక నుంచి గమనిస్తూ ఉంటాడు.. కానీ పైకి మాత్రం తనంటే ఇష్టం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తాడు.. హనీ దగ్గరికి వెళ్లి తను తీసుకొచ్చిన గౌన్ వేసుకోమని పట్టుబడతాడు.. ఇది తులసి ఆంటీ తీసుకొచ్చిన డ్రెస్ నాకు చాలా బాగుంది.. నేను ఇదే ఉంచుకుంటాను అని హనీ అంటుంది.. అంటే నేను తీసుకొచ్చిన డ్రెస్ వేసుకోవా? నా ఇష్టాన్ని యాక్సెప్ట్ చేయవని సామ్రాట్ హనీ పై అరుస్తాడు..

అనసూయమ్మ సామ్రాట్ ని కలిసి నేను చెప్పింది మీరు ఏమి పట్టించుకోవడం లేదు.. తులసి రాగానే మీరిద్దరూ కలిసి లోపలికి నడుచుకుంటూ వెళ్లడం చూసి అందరూ మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో మీకు తెలుసా.. వింటున్నా మా చెవుల్లో నుంచి రక్తం వస్తుంది అని అనసూయమ్మ అంటుంది.. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు నా నిర్ణయం నన్ను తీసుకొనివ్వండి అని సామ్రాట్ అంటాడు.. నువ్వు నిర్ణయం తీసుకునేసరికి హనీ పెళ్లి కూడా జరిగేటట్టుంది అన్నట్టుగా అనసూయమ్మ దెప్త్పి పొడుస్తూ మాట్లాడుతుంది.. మీ అందరికీ పైకి నేను ఇలాగే కనిపిస్తున్నాను కానీ లోపల నేను ఎంత నరక వేదన అనుభవిస్తున్నాను మీకు తెలీదు అని సామ్రాట్ బాధపడతాడు అమ్మ ప్లీజ్ నేను చెప్పేది వినండి అని సామ్రాట్ అనసూయమ్మకు నచ్చితే ప్రయత్నం చేస్తాడు కానీ అనసూయమ్మ మాత్రం సామ్రాట్ చెప్పే మాటలు వినదు. అసలు నానమ్మ ఏం మాట్లాడుతుందా సామ్రాట్ తో ఏం చెబుతుందో అని అభి దూరంగా గమనిస్తూ ఉంటాడు.. ఇక జరగాల్సి మొత్తం జరిగిపోతుంది తులసి ప్లేస్ లో సామ్రాట్ నందుని అపాయింట్ చేస్తాడు.. తులసి ఫైల్ మీద సంతకం చేయడానికి కూడా తనే కారణం మరి ఈ విషయం తులసికి తెలుస్తుందా లేదా అనేది చూడాలి..