Bigg Boss 6 Telugu : “ఒరేయ్ బిగ్ బాస్ గా నీకు బ్రెయిన్ పనిచేయట్లేదా ” అని తెగ తిడుతోన్న ప్రేక్షకులు !

Bigg Boss 6 Telugu : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగులో ఆరవ సీజన్ నడుస్తుంది. మిగతా సీజన్స్ కంటే ఈ సీజన్ చాలా డల్ గా నడుస్తుంది. నాగార్జున ప్రతివారం కంటెస్టెంట్స్ మధ్య ఎంత హైప్ క్రియేట్ చేద్దామని ట్రై చేసినా ఇంటి సభ్యులు మాత్రం తమ ధోరణి తమదే అంటూ సాగుతున్నారు. దీంతో ఆడియన్స్ బిగ్ బాస్ టీమ్ ను పిచ్చి తిట్లు తిడుతున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్ నుండి ఎందుకు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కూడా తెలియట్లేదు.

ఇక టాస్కులు ఆడేటప్పుడైతే ఎలా, ఎందుకు ఆడుతున్నారో అటు కంటెస్టెంట్స్ తో పాటు ఇటు ఆడియన్స్ కి అర్ధం కావట్లేదు. దీంతో ఈ సీజన్ బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లాస్ట్ వీక్ లో నాగార్జున రావడం, సరిగ్గా ఆడట్లేదని క్లాస్ తీసుకోవడం, తర్వాత ఏదో ఎంటర్ టైన్ చేయడానికి ట్రై చేయడం కామన్ అయిపోయింది. ఇక ఓ కంటెస్టెంట్ అయితే నేను హౌస్ లోంచి వెళ్లిపోతాను ‘బిగ్ బాస్.. నాకు అంతా అర్దమవుతుంది, కానీ నాకు హౌస్ లో ఉండాలనే ఉంది’ అనే వీడియో వైరల్ అయ్యింది.

netigens fire on Bigg Boss 6 Telugu
netigens fire on Bigg Boss 6 Telugu

Bigg Boss 6 Telugu : ‘బిగ్ బాస్ ఓ చెత్త ప్రోగ్రామ్’

ఈ క్రమంలో బిగ్ బాస్ స్క్రిప్ట్ ను, నడిపే టీమ్ ను ఆడియన్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ నీకు బ్రెయిన్ పనిచేస్తుందా.. మరీ ఇంత చెత్తలా ఆలోచిస్తున్నావేంటి.. ఇదొక రియాలిటీ షోనా.. నీ స్క్రిప్ట్ ఏంటి? ఆ డైరెక్షన్ ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇకనైనా బిగ్ బాస్ లో టాస్కులు, గేమ్స్ తీరు మార్చకపోతే దుకాణం సర్దుకుని ఇంటికి వెళ్లిపోండి అంటున్నారు నెటిజన్లు. మరి నెక్ట్స్ వీక్స్ లోనైనా ఈ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ తన స్టైల్ ను మారుస్తాడా లేదా అనేది చూడాలి.