Guppedanta Manasu 04 oct Episode : రిషి కోరిన కోరికను మహీంద్రా తీరుస్తాడా.!? వసుధర అల్లరిని కెమెరాలో బందిస్తున్న రిషి..!

Guppedanta Manasu 04 oct Episode : ఏముంటాయి వసుధరాతో మాట్లాడటానికి. తను ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా అని రిషి మనసులో అనుకుంటాడు.. అప్పుడే వసుధర మిషన్ ఎడ్యుకేషన్ తరపున విజిట్ చేయవలసిన కొన్ని లొకేషన్స్ రిషికి షేర్ చేస్తుంది.. అయితే ఇందులో మొదటి లొకేషన్ కి నువ్వు జగతి మేడం ఇద్దరు కలిసి వెళ్ళండి అని వసుధారకు మెసేజ్ చేస్తాడు రిషి.. సరే అని అంటుంది వసు.. ఈ రిషి ఏంటి ఏదో లాగా ఉన్నాడు.. అయితే వీడి మూడ్ బాగోలేదేమో.. అమ్మో ఇప్పుడు వీడి దగ్గరికి వెళ్తే వీడు నన్ను ఏదో ఒకటి అంటాడు అని గౌతమ్ అనుకుంటూ.. రేయ్ రిషి త్వరగా రా పడుకుందాం అని గౌతమ్ పిలుస్తాడు..!

Advertisement

మహేంద్ర జగదీష్ ఇద్దరు కాలేజీకి బయలుదేరుతుండగా డాడ్ అని రిషి పిలుస్తాడు.. గుడ్ మార్నింగ్ అని రిషి విష్ చేస్తాడు.. ఏంటి చెబితే కాఫీ కోసం ఆగుదాం అంటే వద్దు అన్నావు.. ఇప్పుడు ఇక్కడే నిలబడి ఉన్నావేంటి అని మహేంద్ర రిషి ని అవాయిడ్ చేస్తున్నట్లుగా మాట్లాడుతాడు.. కానీ రిషి ఏదో మహేంద్ర తో మాట్లాడాలని అనుకుంటున్నాడని.. అది కూడా పర్సనల్ గా అని తెలుసుకున్న జగతి మహీంద్రా నువ్వు రిషితో కలిసి వెళ్ళు నాకు అర్జెంటు పని ఒకటి ఉంది.. అది చూసుకొని వస్తాను అని జగతి అంటుంది.. థాంక్యూ మేడం నా మనసులో బాధ మీరు అర్థం చేసుకున్నారు అని రిషి అనుకుంటాడు..

Advertisement
Will Mahindra fulfill Rishi's wish Rishi capturing Vasudhara
Will Mahindra fulfill Rishi’s wish Rishi capturing Vasudhara

రిషి మహీంద్రా ఇద్దరూ కలిసి బయలుదేరుతారు.. మధ్యలో రిషి కార్ ఆపి మహేంద్రతో డాడ్ నామీద నీకు కోపంగా ఉందా అని అడుగుతాడు.. కోపం అనేది ఒక మానసిక బలహీనత రిషి.. ఆ ఆ క్షణంలో పాల పొంగులా వస్తుంది పోతుంది.. మాట్లాడుకుందాం రిషి.. మనస్సులో మాటలు మాట్లాడుకుందాం అని మహీంద్రా అంటాడు.. వదిన గారి విషయంలో నువ్వు నన్ను బాధ పెట్టాలని అనుకుంటున్నావేమో.. నీ సంతోషం కోసం ఒక్కసారి కాదు 100 సార్లు సారీ చెప్పడానికైనా కూడా నేను రెడీ.. అది నేనంటే.. నా ప్రేమంటే.. చెప్పు రిషి నేనేం చేయాలి అని మహీంద్రా అడుగుతాడు.. నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను అని అంటాడు..

డాడ్ నాకు వసుధార కావాలి.. ఎలాంటి కండిషన్లు పెట్టకుండా అంతకుముందు నాతో ఎలా ఉందో.. అలాగే వసుధారా కావాలి తన స్వచ్ఛమైన ప్రేమ నాకు కావాలి.. అది నాకు ఇస్తావా డాడ్ అని రిషి తన తండ్రిని పట్టుకుని అడుగుతాడు.. ఒక్క పిలుపు కోసం నా ప్రేమను వదులుకోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది డాడ్.. వసుధార కావాలి డాడ్.. తను తనలాగే కావాలి డాడ్.. డాడ్ మనిద్దరం ఫ్రెండ్స్ లా ఉంటాము ఒక ఫ్రెండ్ కి తన ఫ్రెండ్ కి ఏం కావాలో తెలుసు కదా.. మీరు నన్ను బాధ పెట్టారని నేను నమ్ముతున్నాను డాడ్ అని రిషి అంటాడు.. నీ ఆనందం కోసం ఏదైనా చేస్తాను .. తప్పకుండా చేస్తాను అని మహీంద్రా తన మనసులో అనుకుంటాడు..

వసుధార రిషి కోసం తన క్యాబిన్ కు వెళ్తుంది.. రిషి అక్కడ లేకపోవడం చూసిన వసుధార.. హాయ్ రిషి సార్ పర్లేదు పర్లేదు మనకి మనకి ఫార్మాలిటీస్ ఎందుకు అని అంటుండగా.. అప్పుడే రిషి అక్కడికి వస్తాడు.. ఏంటో జెంటిల్మెన్ ప్రిన్స్ అంటూ ఉంటారు కానీ తన డస్క్ నీట్ గా ఉంచుకోవాలన్న సంగతి కూడా తెలీదు అని వసుధార చేస్తున్న చిలిపి చేష్టలను తన కెమెరాలో బంధించాలి అని చాటుగా రిషి తన కెమెరాలో వీడియో తీస్తాడు.. తన క్యాబిన్ లో ఉన్న హార్ట్ సింబల్ తీసి.. హార్ట్ బాగుంది నీ మనసులో ప్రేమ ఉంది.. నా మనసులో ప్రేమ ఉంది.. అయినా నీకు అంత ముక్కు మీద కోపం ఏంటయ్యా బాబు.. ఏం చేస్తాం రిషి సార్ టోటల్ గా టైం బ్యాడ్ అని అనుకుంటుంది.. వసుధర రిషి సార్ ఈ కుర్చీలో కూర్చొవచ్చా పర్లేదు పర్లేదు ఎంతైనా మన రిషి సారే కదా ఏం అనుకోడులే అని ఎంచక్కా తన చైర్ లో కూర్చుంటుంది..

Advertisement