Hair Tips : ఈ 10 టిప్స్ లో 2-3 పాటించిన చాలు.. తెల్ల జుట్టు నల్లగా అవుతుంది!

Hair Tips : ఈ మధ్యకాలంలో చాలామందికి అనేక కారణాల వల్ల జుట్టు ఊడిపోతుంది. నల్లని పొడవైన జుట్టు కావాలని అందరికీ ఉంటుంది. కానీ, పొడవైన జుట్టు ఉన్న వారు చాలా తక్కువ. పైగా ఉన్న కాస్త జుట్టు కూడా పొల్యూషన్ తో ఊడిపోతుంది. హెయిర్ ఫాల్ సమస్య చాలా కామన్ అయిపోయింది. హార్మోనల్ ప్రాబ్లమ్స్, పోషకాహార లోపం, థైరాయిడ్ సమస్య, ఒత్తిడి, కెమికల్స్ ఎక్కువగా ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ వాడడం, జీన్స్ సరైన హెయిర్ కేర్ రొటీన్ లేకపోవడం.. వంటివి హెయిర్ ఫాల్ సమస్యకు కారణాలు.

మసాజ్ : ఈ చిట్కా చాలా ఎఫెక్ట్ గా పనిచేసి, తక్కువ ఖర్చుతో అయిపోయే చిట్కా ఇది. ప్రతిరోజు జుట్టు స్కాల్ఫ్ నీ మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల రిలాక్స్ అవడంతో పాటు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకు నచ్చే ఆయిల్ ని కొద్దిగా వేడి చేయండి. ఇలా వేడి చేసిన ఆయిల్ ని జుట్టు, స్కాల్ఫ్ కి పట్టించి వేళ్ళతో బాగా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఒక గంట అలా వదిలేయండి. దీని తర్వాత మైల్డ్ షాంపూ తో కానీ, కుంకుడుకాయ తో కానీ తల స్నానం చేయండి. వారంలో రెండు లేదా మూడుసార్లు ఇలా చేయండి.

Hair Tips on Hibiscus flowers are dill
Hair Tips on Hibiscus flowers are dill

మందార పూలు : ఈ పూలలో ఉన్న ఏ, సీ విటమిన్స్, ఎమినో ఆసిడ్స్ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తాయి. రెండు కప్పుల కొబ్బరి నూనెలో పది మందార పూలను, ఆకులను వేసి పూలు నల్లగా అయ్యేవరకు మరిగించండి. దీనిని వడకట్టి, చల్లారనిచ్చి బాటిల్ లో స్టోర్ చేసుకోండి. ఈ ఆయిల్ తో రాత్రి నిద్రపోయే ముందు బాగా మసాజ్ చేయండి. పొద్దున్నే తల స్నానం చేయండి. ఇలా వారంలో కొన్నిసార్లైనా చేయడానికి ప్రయత్నించండి.

మెంతులు : ఈ మెంతులు చుండ్రుని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తాయి. ఒక కప్పు మెంతులను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టండి. పొద్దున లేవగానే వీటిని మెత్తగా పేస్ట్ చేసి జుట్టుకు పట్టించి షవర్ కాప్ తో కవర్ చేయండి. 40 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. వారానికి కనీసం రెండు మూడుసార్లు ఇలా చేయవచ్చు.

ఆపిల్ సిడార్ వెనిగర్ : రెండు టేబుల్ స్పూన్ల ఆన్ పీల్టర్డ్ యాపిల్ సిడార్ వెనిగర్ రెండు స్పూన్ల నీటిలో కలపండి. స్కాల్ఫ్ పట్టించి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు వదిలేయండి. తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానo చేయండి. వారంలో ఇలా ఒకటి రెండు సార్లు చేయొచ్చు.

అలోవెరా : జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలు హెయిర్ ఫాల్ తో సహా, అలోవెరా తో ఆ సమస్యలను తగ్గించవచ్చు. దీనిలో ఉండే ఏ, సీ విటమిన్స్ జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేయడమే కాక జుట్టును మెరిసేలా చేస్తాయి. ఇది డాండ్రఫ్ ని కూడా తగ్గిస్తుంది. అలోవెరా ఆకు నుండి జెల్ నీ తీయండి. ఈ జెల్ ని జుట్టు, స్కాల్ఫ్ కి బాగా పట్టించి 45 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఏ షాంపు వాడకుండా మామూలు నీటితో తల స్నానం చేయండి. ఇలా వారంలో మూడు నాలుగు సార్లు చేయండి.

సరైన ఆహారం తీసుకోండి : హెయిర్ కేర్ రొటీన్ తో పాటు సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా అవసరం. ఏ, బీ,సీ,ఈ విటమిన్స్ ఉన్న ఫుడ్ జింక్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, సెలీనియం ఉన్న ఫుడ్స్ తీసుకోండి. మీ డైట్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ని భాగం చేసుకుంటే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆకుకూరలు, క్యారెట్, ఎగ్స్, ఫిష్, చిలకడ దుంపలు హెయిర్ హెల్త్ కి చాలా మంచివి.