Allu Arjun : డబ్బు కోసం నేను ఇదంతా చేయట్లేదు “అల్లు అర్జున్ ఇన్ డైరెక్ట్ గా చిరంజీవికే కౌంటర్ వేశాడా.. ?

Allu Arjun : తాజాగా హైదరాబాదులోని గండిపేట ప్రాంతంలో 10 ఎకరాల విశాలమైన ప్రదేశంలో అల్లు ఫ్యామిలీ వారు అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం అల్లు స్టూడియోను నిర్మించి, ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ కొణిదెల రిబ్బన్ కటింగ్ తర్వాత అల్లు రామలింగయ్య విగ్రహానికి గజమాల సమర్పించారు. ఇక అనంతరం చిరంజీవి అల్లు రామలింగయ్య తో తనకున్న అభిమానాన్ని పంచుకోవడం జరిగింది. ఇక చిరంజీవి స్పీచ్ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మొదటగా అల్లు స్టూడియో ప్రారంభానికి ముఖ్యఅతిథిగా వచ్చిన చిరంజీవి గారికి నా తరపున, అల్లు ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.. ఈరోజు మా తాతయ్య అల్లు రామలింగయ్య 100వ పుట్టినరోజు ..మాకెంతో ప్రత్యేకం.. వీరికి బాగా డబ్బులు.. ఉన్నాయి అల్లు అరవింద్ కి గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ఉంది. పది ఎకరాల్లో స్టూడియో పెట్టడం వారికి పెద్ద సమస్య కాదే అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మేము డబ్బు సంపాదించడం కోసం ఈ స్టూడియో నిర్మించలేదు.. కేవలం మా తాతయ్య కోరిక ..ఆయన జ్ఞాపకార్థం కోసమే నిర్మించాము.. మంచి మంచి సినిమాల షూటింగుల కోసమే అంకితమిస్తున్నాము అంటూ ఆయన తెలిపారు..

Did Allu Arjun directly counter Chiranjeevi
Did Allu Arjun directly counter Chiranjeevi

ఇక సాధారణంగా ఎవరైనా సరే కొడుకులు మరణించిన తర్వాత వారి తండ్రుల పూజా కార్యక్రమాలు కొన్ని సంవత్సరాలపాటు చేస్తారు. ఆ తర్వాత మరిచిపోతూ ఉంటారు ..కానీ మా నాన్నగారు అలా కాదు..ఆయన చనిపోయి నేటికీ 18 సంవత్సరాలు పూర్తయినప్పటికీ.. మా నాన్నకు వాళ్ల నాన్న పైన ఉన్న ప్రేమను ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నారు. ఇక ఇంతలా వాళ్ళ నాన్నను ప్రేమించడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది . ఇక మా నాన్నకు మా తరఫున అభినందనలు అంటూ తెలియజేశారు. ఇక అల్లు స్టూడియోలో సినిమాలు బాగా జరగాలి.. తెలుగు సినీ పరిశ్రమకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నామని చెప్పడంతో ఈ స్పీచ్ విన్న ప్రతి ఒక్కరు చిరంజీవిని టార్గెట్ చేస్తూ మాట్లాడారా ఏంటి అంటూ కూడా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై మరెన్ని వివాదాలు తలెత్తుతాయో తెలియాల్సి ఉంది.