Chiranjeevi : భార్య సురేఖ అంటే చిరంజీవికి ఎంత ప్రేమో నిరూపించిన సీన్ ఇది .. స్టేజీ మీదనే..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఎంతటి గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్నారు. చిరంజీవి పెళ్లిచూపులు ఎలా సాగింది పెళ్లికి ముందు చిరంజీవి మామగారు నుంచి ఎలాంటి టెస్టింగులు జరిగాయి అనేదానికి ఇన్నాళ్లుగా అభిమానులకు తెలిసింది చాలా తక్కువే.. కానీ ఇటీవల అల్లు స్టూడియో లాంచ్ చేసిన సందర్భంగా చిరంజీవి స్వయంగా కొన్ని విషయాలను సైతం తెలియజేశారు. అల్లు రామలింగయ్య గారు తన అల్లుడిని చేసుకోవడానికి తనకు ఎన్నో టెస్టులు పెట్టాకే అల్లు కుటుంబం.. నాకు పిల్లనిచ్చింది అన్న విషయాన్ని విడమర్చి చెప్పి వీక్షకులను సైతం కడుపుబ్బ నవ్వించారు చిరంజీవి. వాస్తవానికి చిరంజీవి కెరియర్ ప్రారంభం నుంచి అల్లు రామలింగయ్య గారితో కలిసి నటించేవారు. ఈ క్రమంలోని ఈ కుర్రాడు ఎవరు అంటూ అల్లు రామలింగయ్య గారు పదేపదే చిరంజీవిని ఎక్కువగా చూసేవారట.

ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన కొన్ని సన్నివేశాలలో అతని గ్రేస్ ని ఎక్కువగా పసిగట్టే వారట అల్లు రామలింగయ్య. ఇక అల్లు అరవింద్ తో అప్పుడప్పుడు ఈ కుర్రాడికి చాలా భవిష్యత్తు ఉందని చెబుతూ ఉండేవారట. అంతేకాకుండా ఇతర హీరోయిన్లతో తన ప్రవర్తనను కూడా గమనించేవారట. అందరూ కూడా ఎక్కువగా హీరోయిన్లతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే, చిరంజీవి మాత్రం గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు వెళ్లిపోయే వారట. ఇవన్నీ అల్లు రామలింగయ్య, అరవింద్ ఎక్కువగా గమనించేవారట. ఇక చిరంజీవి ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో.. నటన పైన దృష్టిని పెట్టడంతో పైగా కమలహాసన్ వంటి అందగాడు కూడా సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు.. ఇక ఆ సమయంలోనే అంతటి షార్ప్ గా ఉన్న కుర్రాడు చిరంజీవి అని పసిగట్టిన మొదటి వారు అల్లు వారేనని చిరంజీవి తెలియజేశారు. ఇక అలా పసిగట్టాక నెమ్మదిగా చిరు వద్దకు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారట. ఆ సమయంలోనే నువ్వు ఎవరి అబ్బాయివి అంటూ అడగడం ఆరా తీసారట.

Chiranjeevi love his wife Surekha This scene
Chiranjeevi love his wife Surekha This scene

ఒకవైపు సినిమా వాళ్ళను నమ్మి పెళ్లి చేసుకోవద్దని తన స్నేహితులు చిరంజీవికి ఎప్పుడు సలహాలు ఇస్తుండే వారట. అల్లు రామలింగయ్య , అల్లు అరవింద్, నిర్మాత జయకృష్ణ ఎట్టి పరిస్థితుల్లో అయినా సురేఖతో చిరంజీవి పెళ్లి చేయాలని పట్టుబట్టారు. అలా సురేఖతో పెళ్లిచూపులు ఖాయం చేశారట అల్లు రామలింగయ్య. ఒకవైపు చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే కెరియర్ పరంగా వెనుతిరిగి చూసుకోలేదు. కేవలం కాఫీ కని పిలిచి.. పెళ్లిచూపులు జరిపించారట. దీంతో చిరంజీవి సురేఖ స్వయంగా పెట్టిన కాఫీ తాగాక చిరంజీవి వెంటనే ఓకే చెప్పారట. అలా చివరికి వివాహమైందని తెలిపారు. ఇక పెళ్లికి కొన్ని నెలలు సమయం అడగగా అందుకు అల్లు రామలింగయ్య మళ్ళీ మనసు మారుతుందేమో అని వెంటనే ముహుర్తాలు పెట్టించి చిరంజీవికి సమయం అన్నది ఇవ్వకుండా మూడు ముళ్లతో లాక్ చేశారు . ఈ మొత్తం సంఘటనలను చిరంజీవి వర్ణించిన తీరు వేదికకు హాజరైన ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించేలా చేశాయి. ఇక ఈ వేదికపై అల్లుకుటుంబం కూడా ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు.