Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ .. జంటగా రాబోతోన్న రష్మి గౌతమ్- సుడిగాలి సుధీర్ !

Bigg Boss 6 Telugu : బుల్లితెర స్టార్ హీరోగా సుడిగాలి సుధీర్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే రష్మీ కూడా మల్టీ టాలెంట్ తో దూసుకుపోతుంది. మరి వీరిద్దరి జంట అంటే బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ బజ్ ఉంటుంది. మరి అలాంటి క్రేజీ జంట హాట్ హాట్ గా సాగే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇదే విషయాన్ని బిగ్ బాస్ టీమ్ కూడా ఆలోచించింది. ప్రజంట్ బిగ్ బాస్ సీజన్ 6 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. గాసిప్స్, లవ్, ఫైటింగ్స్ అంటూ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా రెచ్చిపోతున్న బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్యలోకి సుధీర్, రష్మీలను జంటగా పంపించేందుకు సిద్ధంగా ఉంది.

అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో సుడిగాలి సుధీర్ కు ఖచ్చితంగా మంచి క్రేజ్ దక్కుతుంది. అలాగే రష్మీతో పాటు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఆడియన్స్ కి ఫుల్ కంటెంట్. ఈ జంటకు బిగ్ బాస్ టీమ్ భారీ రెమ్యునరేషన్ కు కూడా ప్లాన్ చేసింది. దీంతో బిగ్ బాస్ రేటింగ్ కూడా అమాంతం పెరుగుతుందని అనడంలో డౌటే లేదు. నార్మల్ గా ఆన్ స్క్రీన్ లో రష్మీ, సుధీర్ లు కెమిస్ట్రీ ప్రోగ్రామ్ చేస్తే ఊర్రూతలూగే యూత్.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉంటారంటే ఇంట్రెస్ట్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి.

rashmi sudheer wild card entry into Bigg Boss 6 Telugu
rashmi sudheer wild card entry into Bigg Boss 6 Telugu

Bigg Boss 6 Telugu : రష్మీ, సుధీర్ లకు భారీ రెమ్యునరేషన్

ఇక వీరిద్దరూ ప్రజంట్ క్వారంటైన్ లో ఉన్నారు. నెక్ట్స్ సోమవారం, మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఈ జంట్ ఎంట్రీ ఇవ్వడం పక్కా అని స్టార్ మా నుండి న్యూస్ వైరల్ అవుతుంది. వీరి జంటను చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి ఈ జంట ఎంట్రీ బిగ్ బాస్ లో ఉంటుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. ఏదిఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రష్మీ, సుధీర్ ల జంట ఖచ్చితంగా అలరిస్తుందని టాక్ వినిపిస్తుంది.