Rocket Raghava : రాకెట్ రాఘవ కొడుకు కి అంత అమౌంట్ ఇస్తున్నారా ? సుడిగాలి సుధీర్ కూడా పనికిరాడు కదరా బాబు !

Rocket Raghava : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాలెంట్, అదృష్టం ఉన్నవారితో పాటు ఇప్పటికే సెటిల్ అయినవాళ్ల వారసుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి సక్సెస్ అవుతున్నారు. అలాగే బుల్లితెరపై కూడా ఇలాంటి వారసత్వమే కొనసాగుతుంది. బుల్లితెరపై ఫేమస్ కామెడీ షో అయిన జబర్దస్త్ లో కూడా ఇలాగే జరుగుతుంది. జబర్దస్త్ లో రాకెట్ రాఘవ అంటే తెలియని వారుండరు. ఆయను కొడుకు మురారి జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ లో కామెడీ చేస్తున్నారు. డైరెక్ట్ గా తన తండ్రి రాకెట్ రాఘవపైనే పంచులు పేలుస్తూ.. ఆడియన్స్ ను నవ్విస్తున్నారు. ఇక తన తండ్రి బ్యాక్ గ్రౌండ్ తో బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా ఓ సెలెబ్రిటీ రేంజ్ లో సెటిల్ అయ్యాడు మురారి.

Are you giving that much amount to the son of Rocket Raghava
Are you giving that much amount to the son of Rocket Raghava

Rocket Raghava : బాబోయ్ ఆ రేంజ్‌లోనా..

ఇక జబర్థస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో కూడా ఎంటర్ టైన్ చేస్తూ అందర్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. టీమ్ లో ఉండే అందరిపై కామెడీ టైమింగ్ పంచులు పేలుస్తున్నారు. అయితే రాఘవ కొడుకు మురారికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మురారి స్కిట్ లో కనిపిస్తే చాలు దాదాపు 5000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. తన రోల్ కాస్త ఎక్కువగా ఉంటే పదివేల వరకు తీసుకుంటున్నారట. మరి ఈ వయసులోనే ఒక్క రోజుకు పదివేల రూపాయలు తీసుకుంటే తన కెరీర్ లో ఎలాంటి తిరుగులేదు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇంకేం రాకెట్ రాఘవ కొడుకుకు ఈ రేంజ్ లో అమౌంట్ ఇస్తున్నారా అంటూ సెలెబ్రిటీలు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఈ రేంజ్ లో మురారి క్రేజ్ కొనసాగితే.. సుడిగాలి సుధీర్ కూడా ఏమాత్రం పనికిరాడుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఇంత చిన్న వయస్సులో మురారికి ఉన్న క్రేజ్ కూడా చాలా గ్రాండ్ లెవెల్ లో ఉంది. మురారి స్కిట్స్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు.