Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా ?? మీకోసం ఆదిపురూష్ న్యూస్ అతిపెద్ద మ్యాటర్ లీక్ అయ్యింది !

Prabhas :  యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ రీసెంట్ గా నటిస్తున్న లైనప్ లో ఆదిపురుష్ కూడా ఒకటి. ఈ సినిమాపై బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా కృతిసనన్ నటిస్తున్నారు. రావణ్ కారెక్టర్ లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ప్రజంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ అప్పట్నుండి ఈ మూవీకి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా ఈ మూవీ నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్టేడ్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ కు ఓ రేంజ్ లో ప్రమోషన్ దక్కింది. ఇదే ఫ్లోలో అక్టోబర్ 2 న ఆదిపురుష్ మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తున్నామని ఫిల్మ్ టీమ్ ప్రకటించింది అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ టీజర్ రన్నింగ్ టైమ్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుండి వచ్చే అప్డేట్ కావడంతో దీనిపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఆదిపురుష్ టీజర్ 1 నిమిషం 50 సెకన్స్ తో మూవీ యూనిట్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

aadipurush matter leaked
aadipurush matter leaked

మరి ఈ న్యూస్ ఎంత వరకు నిజమో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ మూవీని వచ్చే ఏడాది జనవరి 12 న రిలీజ్ చేస్తున్నారు. ఏది ఏమైనా నెట్టింట్లో ఆదిపురుష్ మూవీ టీజర్ పై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఆదిపురుష్ మూవీ నుండి బిగ్గెస్ట్ న్యూస్ వైరల్ అవుతుందంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి రేపు ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.