Salaar movie : ప్రభాస్ సలార్ లో సమంత ఐటెమ్ సాంగ్ ! బొగ్గు గనుల మధ్యలో దేవ కన్య లాగా..!!

Salaar movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం v.. ఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సలార్ చిత్రాన్ని 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న తరుణంలో, ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!

Samantha item song in Prabhas Salaar movie
Samantha item song in Prabhas Salaar movie

కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండగా, ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో లీకైన ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.. బొగ్గు గనుల మధ్యలో సమంత దేవకన్య లాగా కనిపించబోతుందని వార్తలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి.. పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాలో కూడా సమంత ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. అదే కనుక నిజమైతే మరోసారి బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం అంటున్నారు.. ఈ విషయం తెలిసిన ప్రభాస్ సమంత అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు..