Liger Movie : విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం లైగర్. 2022 ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కనీసం థియేటర్ రెంట్‌కు సరిపడ కలెక్షన్లు కూడా ఈ సినిమా రాబట్టలేకపోవడంతో థియేటర్స్ నుండి వారం రోజుల్లోనే తీసేసారు. ఇక ఓటీటీలో ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరు ఆశగా ఎదురు చూడగా, గురువారం (సెప్టెంబర్ 22) నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అసలు ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని హాట్‌స్టార్‌తో మేకర్స్ డీల్ కుదిరించుకున్నారు.
అయితే సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో.. హాట్‌స్టార్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం ఇస్తా అని చెప్పడంతో తొందగా స్ట్రీమింగ్ చేశారు. పాన్ ఇండియా సినిమాగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేక్షకులు సినిమాని తెగ చూసేస్తున్నారని,విజయ్ పర్ఫార్మెన్స్కి తెగ ఫిదా అవుతున్నారని సమాచారం. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి దారుణంగా ట్రోలింగ్ కూడా నడుస్తుంది. విజయ్ దేవరకొండ నత్తి డైలాగ్స్ పై కామెంట్స్ తో పాటు మీమ్స్ కూడా పేలుతున్నాయి.
Liger Movie : అదరగొట్టేస్తుందిగా..
సీరియస్ గా, ఫుల్ యాక్షన్ తో సాగుతుందనుకున్న మైక్ టైసన్ ఫైట్ సిల్లీగా సాగిందని కొందరు అంటున్నారు. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కమెడియన్ మైక్ టైసన్ అంటూ పోస్టులు పడుతున్నాయి. సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, లవ్ అన్నీ సమపాళ్లలో కలిసిన ఈ సినిమా చూడడం కుటుంబం మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా “లైగర్”. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కష్టాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ పాత్ర కోసం అతడు తనను తాను మలుచుకున్న విధానానికి ఫిదా అవుతున్నారు. మరికొంతమంది నెటిజన్లు సాంగ్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.