Gauri Khan : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఎంత ఫేమస్ అనే దాని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. షారూఖ్ ఖాన్‌తో పాటు ఆయన సతీమణి , పిల్లలు కూడా అభిమానులకి సుపరిచితమే. షారూఖ్ సతీమణి గౌరీ ఖాన్ సెలబ్రిటీల ఇంటికి ఇంటీరియర్ డిజైనర్‌గా చూస్తూ పాపులారిటీ దక్కించుకుంది. ఇక షారూఖ్ తనయడు ఆర్యన్ ఖాన్ ఇటీవల డ్రగ్స్ కేసుతో నిత్యం వార్తలలో నిలిచాడు. ఇక కూతురు సుహానే ఖాన్ సోషల్ మీడియాలో నిత్యం అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. అయితే తన కూతురు డేటింగ్ వ్యవహారంపై గౌరీ ఖాన్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది.
కాఫీ విత్ కరణ్ టాక్ షోకు హాజరైన గౌరీఖాన్ తన కూతురు సుహానా ఖాన్ గురించి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. సుహానాకు డేటింగ్ విషయంలో మీరిచ్చే సలహా ఏంటని గౌరీఖాన్‌ను ప్రశ్నించాడు కరణ్ జోహార్. దీనిపై గౌరీ ఖాన్ స్పందిస్తూ..ఒకే సమయంలో ఇద్దరు బాయ్స్ తో డేటింగ్ చేయొద్దని సలహా ఇస్తానని చెప్పింది. ఇక షారుక్‌తో మీరు లవ్ స్టోరీ చేస్తే ఏం టైటిల్ పెడతారు..అని అడిగితే దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే అని చెప్పింది గౌరీఖాన్. అమ్మలు తమ పిల్లలు, వారి రిలేషన్ షిప్స్ గురించి భయపడిన సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో హింట్ ఇస్తూ.. గౌరీఖాన్ చేసిన కామెంట్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
Gauri Khan : తల్లి ఇలాంటా మాటలు మాట్లాడడమా?
పెళ్లికి ముందు డేటింగ్ నే తప్పు. అలాంటిది తన కూతురిని ఇద్దరితో కాదు ఒకే సారి ఒక్కరితో మాత్రమే చేయండిని గౌరీ ఖాన్ ఇచ్చిన సలహా పై కొందరు మండిపడుతున్నారు. కుమార్తెలకు ఇలాంటి సలహాలు ఏ తల్లైనా ఇస్తుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సుహానా ఖాన్ ది అర్చీస్ చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల కుమార్తెలు…మనవరాళ్లు తెరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయితే సుహానే కెరీర్‌కి తిరుగు ఉండదని అంటున్నారు.