Siri Hanumanth : బిగ్ బాస్ కార్యక్రమం కొందరికి పాజిటివిటీని తీసుకొస్తే మరి కొందరికి నెగెటివిటీని తెచ్చిపెడుతుంది. అలా సీజన్ 5లో పాల్గొన్న సిరికి ఈ షో ద్వారా ఎంత నెగెటివిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిరి హన్మంత్ ఒకప్పువు రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది. అలా ఫేమస్ అయిన తర్వాత ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’, ‘అగ్ని సాక్షి’ వంటి సీరియళ్లలో నటించి పాపులారిటీ తెచ్చుకుంది. తద్వారా బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది.
సిరి సీరియల్స్ మాత్రమే కాదు సినిమాలు కూడా చేసింది ‘ఇద్దరి లోకం ఒక్కటే’, ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు, ‘మరపురాని ప్రేమకథ’, ‘దట్’, ‘4 డేస్ విత్ సిరి’, ‘లవ్ అండ్ డౌట్’ వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. మొత్తానికి సిరి పాపులారిటీ బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టేలా చేయగా, షోలో బాగానే ఆడి అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ఆమె వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా షన్నూతో రొమాన్స్ చేయడం.. హగ్గులు ఇవ్వడం.. ముద్దులు పెట్టడం.. పక్కనే పడుకోవడం.. అలగడం వంటివి చేస్తూ తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది.
Siri Hanumanth : తప్పదు మరి..
శ్రీహాన్ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ జరుపుకొని బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన సిరి హౌజ్‌లో షణ్ముఖ్ అనే వ్యక్తితో అలా ప్రవర్తించడం అందరిని షాక్ కి గురి చేసింది. సిరి తల్లి కూడా హౌజ్‌లోకి వెళ్లినప్పుడు వారికి చురకలు అంటించింది. అయితే బయటకు వచ్చాక తన తప్పు తెలుసుకొని ప్రస్తుతం శ్రీహాన్‌తో సంతోషంగా ఉంటుంది. శ్రీహాన్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6లో సందడి చేస్తుండగా, ఆయన గెలుపు కోసం చాలా కష్టపడుతుంది. తనకున్న షూటింగ్స్, అపాయింట్ మెంట్స్ అన్నింటిని క్యాన్సిల్ చేసుకొని శ్రీహాన్ కోసం గట్టిగా కృషి చేస్తుంది. ప్రతి రోజు సోషల్ మీడియాలో శ్రీహాన్‌కి మంచి పాపులారిటీ దక్కేలా చేస్తుంది.