Vastu Tips : అద్దె ఇల్లు వెతుకుతున్నప్పుడు, పొంతిల్లు చూసుకున్నప్పుడు ఇల్లు ఏ ఫేసింగ్ ఉందో చూసుకుంటారు. చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ను ఇష్టపడతారు. మీరు ఏ దిశలో ఉండాలన్నది మీ నక్షత్రం డిసైడ్ చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు. ఆరోగ్యం, సంతానం, ఆనందం, సంపద, మనం నివసించే ఇంటి వాస్తుపై ఆధారపడి ఉంటాయి. ఇంట్లో ప్రతి అడుగూ వాస్తు ప్రకారమే ఉండాలని కోరుకుంటారు. చాలామంది సింహద్వారం తూర్పువైపు ఉండేలా చూసుకుంటారు. మరికొంతమంది ఉత్తరం కావాలనుకుంటారు. ఇంకొందరు పడమర వైపు ఇల్లు విశాలంగా ఉంటుందని భావిస్తారు.
వాస్తవానికి తూర్పు దిశ అందరికీ నప్పదని మీకు తెలుసా?. మీకు నప్పిన దిశవైపు సింహద్వారం ఉండేలా చూసుకోవాలి. ఇది కేవలం సొంత ఇల్లుకు మాత్రమే అనుకుంటే పొరపాటే.. అద్దెకు ఉన్న ఇల్లు కు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే మనం ఉండే అద్దె ఇంటి వాస్తు బాగుంటే అది సొంతింటి కలను నెరవేరుస్తుందంటారు. ఇంతకీ మీ నక్షత్రాల ప్రకారంగా ఏ దిశలో ఉండే ఇల్లు తీసుకోవాలో చూడండి. వాస్తు పండితులు ప్రతి నక్షత్రానికి రెండు దిక్కులను సూచించారు. మొదటగా సూచించిన దిశ ప్రకారం ఇల్లు తీసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది.
మీ నక్షత్రం ప్రకారం మీ ఇంటి ఫేసింగ్ ఎటువైపు ఉండాలంటే:
అశ్విని : తూర్పు, పడమర
భరణి : తూర్పు, ఉత్తరు
కృత్తిక: తూర్పు, ఈశాన్యం
రోహిణి: తూర్పు, దక్షిణం
మృగశిర : దక్షిణం, ఉత్తరం,
ఆరుద్ర : పడమర, దక్షిణం,
పునర్వసు : ఉత్తరం, తూర్పు
పుష్యమి : పడమర, ఉత్తరం
ఆశ్లేష : తూర్పు, ఉత్తరం
మఖ పడమర, తూర్పు
పుబ్బ : తూర్పు
ఉత్తర : తూర్పు, ఉత్తరం
హస్త : ఉత్తరం, మార్పు
చిత్త : దక్షిణం, తూర్పు
స్వాతి: దక్షిణం, పడమర
విశాఖ: ఉత్తరం, తూర్పు
అనూరాధ : పడమర, ఉత్తరం:
జ్యేష్ట : తూర్పు, ఉత్తరం
పడమర, దక్షిణం
పూర్వాషాఢ : తూర్పు, ఉత్తరం
ఉత్తరాషాఢ : తూర్పు, ఉత్తరం
శ్రవణం : తూర్పు, దక్షిణం
ధనిష్ట : దక్షిణం, ఉత్తరం
శతభిషం : దక్షిణం, పడమర
పూర్వాభాద్ర : ఉత్తరం, తూర్పు
ఉత్తరాభాద్ర : పడమర, ఉత్తరం
రేవతి : ఉత్తరం, తూర్పు
మీ నక్షత్రానికి నప్పని దిశలో ఇల్లు తీసుకుంటే.. ఎంత సంపాదించనా ఆ ఇంట్లో నిలువదు. చిన్న విషయాలకే పెద్ద తగాదాలు జరుగుతాయని, మనశ్శాంతి ఉండదంటారు. అలాంటప్పుడు ఇంటి యజమానికి సరిపడిన దిశే ముఖ్యం.. వారికి నప్పే దిశ ఉన్న ఇంటిని తీసుకోవాలి గృహమే స్వర్గసీమ అంటారు… అందుకోసమే ఇల్లు ప్రశాంతంగా ఉంటే అంతకుమించిన ఆనందం ఏముంటుంది.