Karthika Deepam 13 Oct Episode : హమ్మయ్య.. ఇప్పటికైనా కార్తీక్ దీప, ఒక్కటయ్యారా.!?

Karthika Deepam 13 Oct Episode : వారణాసి కార్తీకి గతంలో జరిగినదంతా చెబుతాడు. ఇప్పటికైనా నమ్మండి కార్తీక్ బాబు నేను చెప్పింది గుర్తుకు వచ్చిందా అని కార్తీక్ అర్థమయ్యేలాగా వారణాసి చెబుతాడు.. సరే వారణాసి కాసేపు నన్ను డిస్టర్బ్ చేయబాకు.. కాస్త దూరంగా వెళ్ళు అని వారణాసిని కార్తీక్ దూరంగా పంపిస్తాడు. అంతలో దీపను అటాక్ చేయడానికి మౌనిత మనుషులు వెళుతుండగా.. వెనక నుండి చూసిన వారణాసి వాళ్ళని అడ్డుకుంటాడు.. దాంతో తనకి గాయాలవుతాయి. అక్కడే వారణాసి పడిపోయి ఉంటాడు..ఇదంతా దీప గమనించదు..!

మోనిత చేసిన దానికి శౌర్య కు విపరీతమైన కోపం వస్తుంది. దాంతో దూరంగా ఉన్న మోనిత కు రాయి విస్సిరి కొడుతుంది. బాబయి బాబయి త్వరగా ఆటో తియ్యి అని శౌర్య అంటుంది.. ఏమైంది అని శౌర్య ను అడుగుతాడు వాళ్ళ బాబాయి.. ఆ మోనితా ను కసి తీరా రాయితో కొట్టాను అని శౌర్య అంటుంది.. కానీ తగలలేదు అని ఛా మిస్స్ అయ్యింది బాబాయి అని శౌర్య అంటుంది.. ఇంత లేదు ఆ శౌర్య నన్ను రాయితో కొట్టింది.. పోని అందరినీ మ్యానేజ్ చేయలేక చస్తున్నాను.. ఇదంతా ఆ దుర్గ వల్లనే.. ఇదంతా నేను అడిన నాటకం అని కార్తీక్ కు తెలిసిపోతే నా పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తోంది అని మొనిత కవెరితో చెబుతుంది.

karthika-deepam-13-oct-today full episode
karthika-deepam-13-oct-today full episode

కార్తీక్ వారణాసి చెప్పిన విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దీప తన భార్యని.. శౌర్య, హిమ తన పిల్లలు అని ఒక్కొక్క విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. దీప తనని వదిలి వెళ్ళిపోవటం.. ఆ తర్వాత సౌర్య తనని నాన్న అని గుర్తు పట్టడం.. మళ్లీ వాళ్లంతా కలిసి టూర్ వెళ్లడం ఆ టూర్ లో హిమ కార్ డ్రైవింగ్ చేయడం.. అలా లోయలో పడిపోవడం అన్నీ ఒక్కొక్కటి కార్తీక్ గుర్తుకు వస్తాయి అంటూ కార్తీక్ పెద్దగా కేకలు వేస్తాడు. దీపా దీప అంటూ పెద్ద పెద్దగా కేకులు పడతాడు..

దీప కార్తీక్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది.. కానీ ఎంత వెతికినా దొరకలేదు.. దీప కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది.. అన్నయ్య డాక్టర్ బాబు కోసం వెళ్ళాను.. అక్కడ డాక్టర్ బాబు కనిపించలేదు ఆ మౌనితనా కనిపించిందా అన్నయ్య అని అడుగుతుంది. తను కూడా కనిపించలేదు అని చెబుతాడు. నన్ను ఇక్కడ పిచ్చిదాన్ని చేస్తుంది అన్నయ్య.. మనం ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు.. అది నా దృష్టి మళ్లించి వెళ్ళింది అనుకుంటా అన్నయ్య.. ఇక్కడే ఉండి నువ్వు ఏవేవో ఆలోచించకు అని చెబుతాడు.. పదా దీప ఇంటికి వెళ్దాం అని దీప ను ఇంటికి తీసుకు వెళ్తాడు..

కార్తీక్ వారణాసి నీ తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు.. డాక్టర్స్ కార్తీక్ ను నీ పేరేంటి అని అడుగుతారు. కార్తీక్ నా పేరు కార్తీక్ నేను హైదరాబాద్లో కార్డియాలజిస్ట్ ఐ యాం డాక్టర్ అని చెబుతాడు. డాక్టర్ నేను వచ్చేటప్పుడు ఒక అతన్ని గాయాలతో తీసుకువచ్చాను అతనికి ఏమైంది అని అడుగుతాడు.. కండిషన్ బాగోలేదు.. మీకు ఏం కాలేదు.. ఇక్కడే ఉండి రేపు వెల్ల్లోచ్చు అని అంటాడు.. దీపా ఇంటికి వచ్చాక కార్తీక్ కోసం ఏడుస్తూ ఉంటుంది అసలు ఆ మౌనితకు కార్తీక్ గురించి తెలియదు. కార్తీక్ అక్కడే తప్పిపోయాడు అని దుర్గా చెబుతాడు.. ఆయనను చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు కదా వెళ్దాం అని దుర్గతో అంటుంది.. దీప ఇంట్లో నుంచి నడుచుకుంటూ వస్తుంది ఎదురుగా కార్తీక్ వస్తాడు. దీప చూసుకోకుండా కార్తీక్ ని ఢీకొడుతుంది.. కార్తీక్ తన చేతులతో దగ్గరికి తీసుకుంటాడు మిగతా విషయాలు చూద్దాం..