Guppedanta Manasu 13 Oct Episode : అబ్బబ్బ సూపర్ సీన్.. రిషి, వసుధర దేవయాని ముందు అలా అలా..!

Guppedanta Manasu 13 Oct Episode : రిషి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంటాడు.. ఇంట్లో అందరికీ భోజనం నేనే వడ్డిస్తాను అని అంటాడు.. రిషి అందరికీ భోజనం వడ్డిస్తూ జగతికి కూడా వడ్డిస్తాడు.. జగతికి రిషి భోజనం వడ్డిస్తూ మేడం మీరు ఫుల్ గా తినాలి అని అంటాడు.. సరే అని జగతి తల ఊపుతుంది. వసుధర నువ్వు కూడా ఎప్పుడు తిన్నవో ఏమో నువ్వు ఫుల్ గా తిను అని రిషి అంటాడు.. డాడ్ మీరు ఎందుకు మేడం ను తీసుకొని ఒక వెకేషన్ కి వెళ్ళకూడదు.. అలా వెకేషన్ కి వెళ్తే మేడం మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా అని రిషి అంటాడు.. రిషి నువ్వు ఇలా ఆలోచించడం ఎప్పటినుంచి మొదలు పెట్టావు రా అని గౌతమ్ మనసులో అనుకుంటాడు .. మహేంద్ర సరే సరే అని మొహమాటానికి అన్నట్టుగా అంటాడు.. నువ్వే చేస్తుంటే ఇంక నేనేం చేయాలి అని దేవయాని అనుకుంటుంది..!

రేయ్ రిషి అసలు బొమ్మలు కొలువు అంటే ఏంటో చెప్పు అని గౌతమ్ అడుగుతాడు.. చిన్నప్పుడు నా బాల్యంలో కొన్ని కొన్ని సంతోషాలకు నేను దూరమయ్యాను.. అవి ఏంటో కూడా నాకు తెలీదు అని గౌతమ్ అంటాడు. రిషి నువ్వు మంచి ఐడియా తీసుకున్నావు అని మహేంద్ర అంటాడు.. నేటి తరానికి ఈ బొమ్మలకు రోగు గురించి మనం చెప్పాలి అని వసుధార అంటుంది. ఈ ఇంట్లో పెద్దమ్మ నిర్ణయం లేకుండా ఇంట్లో ఏ పని జరగదు అని రిషి అంటాడు.. ఏమంటావు పెద్దమ్మ అని రిషి అంటాడు.. అన్నీ నువ్వే చెప్పి మళ్ళీ నా గురించి ఎందుకులే రిషి అని దేవయాని అంటుంది..

guppedanta-manasu-13-oct-today full episode
guppedanta-manasu-13-oct-today full episode

బొమ్మల కథలు అంటే మనం అటు ఇటు నుంచొని ఫోటోలు దిగడం అంతే కదా పెద్దమ్మ అని గౌతమ్ అంటాడు రేయ్ నువ్వు చెప్పేది అసలు కాదు అని రిషి అంటాడు అసలు బొమ్మలు కలువ అంటే ఏంటో అని దేవే అని చెప్పబోతుండగా నేను చెబుతాను అంటూ వసుధారా లంగా ఓణీ లో వస్తుంది.. అప్పుడే మన హీరో రిషి హీరోయిన్ ను చూస్తూ ప్రపంచాన్ని మరిచిపోయి తననే చూస్తూ ఉంటాడు.. వసుధరా ఆ బొమ్మల కొలువు గురించి చెబుతుండగా.. చేస్తున్నాం కదా ఇక ఎందుకు చెప్పడం అని దేవయాని అంటుంది..

బొమ్మల కొలువు కు కావలసిన చీరలు కావాలి అని వసుదర అంటుంది.. అప్పుడే ధరణి తన రూమ్ లో ఉన్నాయని చెప్తుంది వసుధర ఒక్కతే ధరణి రూములోకి వెళ్తుండగా.. ఎవరినైనా తోడు తీసుకెళ్లొచ్చు కదా అని రిషి అంటాడు. రిషి చేతిలో ఉన్న బొమ్మలు గౌతమ్ కి వచ్చి తోడుగా మీరే రండి సార్ అని వసుధర రిషి చేతిని పట్టుకుని పైకి తీసుకువెళ్లి పోతుంది. మిగతా వాళ్ళందరూ మాత్రం ఆ సీన్ చూసి తెగ ఎంజాయ్ చేసేస్తారు..

మహీంద్రా అలా చూస్తూ ఉంటావేంటి త్వరగా కానివ్వండి అని దేవయాని అంటుంది. ధరణి ప్రసాదాలు సిద్ధం చేసావా వెళ్లి తీసుకురా పో అని కమాండ్ చేస్తుంది.. అప్పుడే గౌతమ్ జగతి మేడం దగ్గరికి వెళ్లి మేడం పెద్దమ్మ కొట్టి కుళ్ళు బఠాణి కదా అని అంటాడు.. ఏంటి గౌతమ్ అన్నావు అని దేవయాని అడుగుతుంది. ఏం లేదు పెద్దమ్మ మీ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది అని గౌతమ్ అంటాడు. నువ్వు ఒక్క మాటే కదా అనింది అని అంటుంది. ఆ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి అని గౌతమ్ అంటుండగా.. జగతి లో లోపల ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంది దేవయాని సీరియస్గా వాళ్ళందరి వైపు చూస్తుంది..