Intinti Grhalakshmi 08 oct Episode : లాస్య రేపటికి సూపర్ ట్విస్ట్ సిద్ధం చేసింది.. సామ్రాట్, తులసి మెడకు ఉచ్చు బిగిసుకుంటుందా.!?

Intinti Grhalakshmi 08 oct Episode : మీరు నిజంగా ఇక్కడ వరకు ఈ ఫైల్స్ కోసమే వచ్చారా.. అసలు ఎందుకోసం వచ్చారు చెప్పమని తులసి అడుగుతుంది.. దేని గురించో మదనపడుతున్నారు.. నా గురించా.. నేను బాధపడుతున్నాను అని నాకోసం ఎంత దూరం వచ్చారా.. మరోసారి చెప్తున్నాను సామ్రాట్ గారు.. మన స్నేహం కోసం నన్ను మీరు భరించలేరు కదా.. నిజానికి మీరు ఫీల్ అయ్యి నన్ను గుడ్డిగా నమ్మడం.. ఆఫీసులో ఉన్న జనరల్ మేనేజర్ గా మన మధ్య ఉన్న బంధాన్ని తెంపేశారు కానీ మన స్నేహబంధాన్ని తెంపలేదు కదా నేను మీ దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు.. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు.. అవసరం కోసం చేసేది స్నేహం కాదు.. ఆ స్నేహానికి వెన్నుపోటు పొడవడం హత్య కంటే ఎక్కువ అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు.. ఏంటి అలా చూస్తున్నారు.. మీకు కోపం రాదా.. వస్తుంది అప్పుడప్పుడు అని తులసి నవ్వుతుంది..

అన్నట్టు మీకు ఓ విషయం కాల్ చేసి చెబుదామని అనుకున్నాను.. రేపు మా కాలనీలో దసరా సంబరాలు వేడుకగా జరుపుకుంటున్నారు.. మేము కూడా వెళ్దాం అనుకున్నాం.. హానిని తీస్కుని మీరు రండి అని తులసి అంటుంది.. నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి.. నేను రాను ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్స్ అని సామ్రాట్ అంటాడు.. అయితే హానిని మాత్రం తప్పకుండా పంపించండి అని తులసి అంటుంది.. సరే అని సామ్రాట్ అంటాడు..

intinti gruhalakshmi 08 oct today full episode
intinti gruhalakshmi 08 oct today full episode

లాస్య అనసూయమ్మకు ఫోన్ చేస్తుంది.. మీతో మాట్లాడాలని కాల్ చేశాను అత్తయ్య అని లాస్య కూల్ చేస్తూ మాట్లాడుతుంది.. సామ్రాట్ వాళ్ళ ఆఫీస్ లో మనేజర్ జాబ్ వచ్చింది.. అది కూడా మీ వల్లే అని నందు అనుకుంటున్నాడు. నందుకి మీరంటే ఎనలేని ప్రేమ.. అందుకే ఈ పండక్కి మీ పేరు మీద అమ్మవారికి పూజ చేయించాలి అని అనుకున్నాడు అని లాస్య అనసూయమ్మ ను కూల్ చేస్తుంది.. మేము అమ్మవారి గుడి కి వెళ్తున్నాం. మీరు కూడా అక్కడికి వచ్చేయండి ఆ పూజ ఏదో అక్కడే చేసుకుందాం అని అనసూయమ్మ అంటుంది.. నందు నందు అని లాస్య అని పెద్దగా అరుస్తుంది ఏంటి అని నందు వస్తాడు.. నీకు జనరల్ మేనేజర్ గా జాబ్ వచ్చిందని నేను అత్తయ్య పేరు మీద పూజ చేయించాలి అని అనుకున్నాను.. అమ్మ ఒప్పుకోవాలి కదా అని నందు అంటాడు.. ప్రోగ్రాం మొత్తం సెట్ చేశాకే నీతో మాట్లాడుతున్నాను అని లాస్య నందుతో చెబుతుంది.. డైరెక్ట్ గా గుడిలో కలుసుకుందామని చెబుతుంది లాస్య..

హనీ ఇంకా రాలేదు ఏంటి బాబాయ్ అని అడుగుతాడు సామ్రాట్.. సరే ఐదు నిమిషాల్లో అని వాళ్ళ ఇంటికి వస్తుంది అని తులసి గారికి ఫోన్ చేసి చెప్పు అని సామ్రాట్ అంటాడు.. అదేదో నువ్వే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని వాళ్ళ బాబాయ్ అడుగుతాడు. తనకి నీకు ఇంకా దూరం కావాలని పెంచుకుంటున్నావా అని అడుగుతాడు. ఈ ఫంక్షన్ కి నువ్వు కూడా వెళ్లొచ్చు కదా అని వాళ్ళ బాబాయ్ అంటాడు. జనానికి మరోసారి మా ఇద్దరు గురించి మాట్లాడుకునే అవకాశం నేను ఇవ్వాలి అని అనుకోవటం లేదు బాబాయ్ అని సామ్రాట్ అంటాడు..

తులసి వాళ్ళు రెడీ అయ్యి గుడికి వస్తారు.. అక్కడికి నందు లాస్య వస్తారు.. వాళ్లని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది తరువాయి భాగంలో లాస్య ఫోన్ తీసుకుని హనీ సామ్రాట్ కి ఫోన్ చేసి సడన్గా కడుపునొప్పిగా ఉంది నాన్న.. బాగా నొప్పిగా ఉంది.. ప్లీజ్ నాన్న నాకోసం రా అని హనీ లాస్య ఫోన్లో నుంచి ఫోన్ చేస్తుంది.. తులసికి సామ్రాట్ కి మధ్య ఉన్న రిలేషన్ పర్మినెంట్గా తెంపితేనే నాకు నిజమైన దసరా పండగ అని లాస్య మనసులో అనుకుంటుంది..లాస్య ఉచ్చులో తులసి సామ్రాట్ బలి కానున్నారా లేదా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం..