Bigg Boss Revanth : హౌస్ లో రేవంత్ చేసిన పనికి .. ‘ ఆమె ‘ చనిపోయే పరిస్థితి వచ్చిందా ?? జస్ట్ మిస్..?

Bigg Boss Revanth : బిగ్ బాస్ హౌస్ అంటే ఎప్పుడూ కూడా గొడవలతో, అరుపులతో , కేకలతో చాలా రసవత్తంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే గడిచిన నాలుగవ తేదీ , 5వ తేదీ ఎపిసోడ్లో మాత్రం అలాంటివి ఏమి లేకుండా కేవలం సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించారు బిగ్ బాస్. ఇక ఈ రెండు ఎపిసోడ్లలో బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. బిగ్ బాస్ తో పాటు, ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్మెంట్ చేసేందుకు ఇంట్లోని సభ్యులు కూడా చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. ఇందులో భాగంగా హౌస్ లో రాత్రిపూట మెరీనా, వాసంతి మాత్రం దెయ్యాల లాగా వేసం వేసుకొని కనిపించారు. అయితే తాజాగా ఎపిసోడ్లో కొద్దిగా ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. రేవంత్ వేసిన గొడ్డలి వేటికి ఇనయ బలయ్యేది. కానీ కొద్దిగా ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. అయితే ఎప్పుడు గొడవలు అరుపులు వంటి వాటితో బిగ్ బాస్ షో ఉండేది కానీ ఈనెల 4 ,5వ తేదీ మాత్రం చాలా సరదాగా సాగిపోయింది..

బిగ్బాస్ తో సహా ఇంటి సభ్యులు అందరూ కూడా చాలా కామెడీని పండించే ప్రయత్నం చేశారు. ఇక ఈ బిగ్ బాస్ ఆరో సీజన్ లో బర్తడే వేడుకలను చాలా ఘనంగా చేసుకున్నారు. అంతేకాకుండా స్కిట్ లో భాగంగా ఫైమా సీక్రెట్ టాస్క్ లో భాగంగా ముగ్గురి ఇంటి సభ్యులను నిద్ర చెడగొట్టాల్సి ఉండగా అందులో సక్సెస్ అయినట్లుగా తెలుస్తున్నది. ఇక తర్వాత స్కూల్ స్కిట్ లో బాల ఆదిత్య టీచర్ లా.. మిగిలిన హౌస్ మేట్స్ అందరూ స్కూల్ పిల్లల బాగా ఆకట్టుకున్నారు. తాజాగా అక్టోబర్ 6వ తేదీన ప్రసారమైన 32వ , 33వ ఎపిసోడ్ కాస్త ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే కెప్టెన్సీ పోటీదారుల విషయంలో సెక్షన్ లోని భాగంగా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన టాప్ -6 కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేయాలని బిగ్ బాస్ తెలియజేశారు. ఇక అందులో సెలెక్ట్ చేసిన వారు ఎవరో చెప్పాల్సిందిగా కెప్టెన్ కీర్తి భట్ ఆదేశించారు. దీంతో బిగ్ బాస్ ఫైమా, ఆర్జె సూర్య, రేవంత్, గీతూ రాయల్, బాలాదిత్య ,రాజశేఖర్లను సెలెక్ట్ చేసింది బిగ్ బాస్.ఇక సెలక్ట్ అయిన కంటె స్టెంట్ లకు బిగ్ బాస్ గొడ్డలి ఇచ్చి కట్టెలు కొట్టి..

Bigg Boss 6 Telugu For work done by Revanth in Bigg Boss house
Bigg Boss 6 Telugu For work done by Revanth in Bigg Boss house

అందుకు తగిలించిన బ్యాగులో ఉన్న ఫోటోలను తగల పెట్టాలన్నది టాస్క్ . ఈ టాస్క్ సంచాలక్ గా ఇనయ సుల్తానా వ్యవహరించింది. టాస్క్ బాలాదిత్యానికి మొదలైంది. ఆ తరువాత రాజ్, ఫైమా, గీతు రాయల్ టాస్క్ ను పూర్తి చేశారు. ఆర్ జె సూర్య, రేవంత్ లను ఒకేసారి టాస్క్ నిర్వహించాల్సిందిగా బిగ్ బాస్ తెలియజేశారు. దీంతో రేవంత్ గొడ్డలితో కట్టెలు కొడుతున్నప్పుడే సడన్గా రేవంత్ చేతి నుంచి స్లిప్ అయ్యి ఎగిరి పడింది ఆ గొడ్డలి. సంచాలకులుగా వ్యవహరిస్తున్న ఇనయా సుల్తానా పక్కనుంచి దూసుకు వెళ్ళింది దానికి ఆమె అరుస్తూ పక్కకు వెళ్లిపోవడంతో ఈమె ప్రాణాపాయం తప్పింది. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు రేవంత్ జాగ్రత్త చూసి కొట్టు అని కేర్ ఫుల్ గా ఆడమని సలహా ఇచ్చారు. దీని తర్వాత కెప్టెన్సీలో కంటెండర్ టాస్క్ లో టాప్-3 లో బాలాదిత్య, రేవంత్, ఆర్ జె సూర్య కూడా ఉన్నారు అయితే వీళ్ళ అందరితో పాటు పైమా కూడా చాలా బాగా ఆడింది.