Guppedanta Manasu 14 oct Episode : తన కోడలికి తన చేత చీర ఇప్పించిన రిషి..! వసు కట్టుకుంటుందా.!? మరి గురుదక్షిణ.!?

Guppedanta Manasu 14 oct Episode : వసుధర రిషి ఇద్దరు కలిసి బొమ్మల కొలువు కు ఒక శారీ సెలెక్షన్ ఫైనల్ చేస్తారు…. వసుధర ఇచ్చిన బొమ్మలను రిషి ఆ బొమ్మల కొలువులో పెడదామని తీసుకువస్తాడు.. సార్ ఇలా అయితే మనిద్దరం కలిసి ఓ సెల్ఫీ దిగుదామని వసుధారా అంటుంది. ఇక వసుధార చీరను పట్టుకొని కిందకు వస్తుంది. మరోపక్క రిషి బొమ్మలను తీసుకొని వస్తాడు.. ఈ బొమ్మలు ఎక్కడివి నాన్న అని దేవయాని అడుగుతుంది.. అది నేనే ఇచ్చాను మేడం అని వసుధారా అంటుంది.. ఇద్దరూ కలిసి నిలబడండి రా ఫోటోలు తీస్తాను అని గౌతమ్ అంటాడు.. పెద్దమ్మ నువ్వు కూడా నుంచో ఫోటోలు తీస్తాను అని అంటాడు.. పెద్దమ్మ నేను ఇప్పుడే వస్తాను అని రిషి మరోసారి పైకి వెళ్తాడు..

రిషి పైకి వెళ్లి ఒక చీరను తీసుకువచ్చి ఈ చీరను వసుధారకి ఈ ఇంటి కోడలుగా ఇవ్వండి అని జగతి మేడం తో అంటాడు.. రిషి మాటలకు జగతి పట్టరాని సంతోషం పడుతుంది.. మా అత్తగారి చీరను నేను నా కోడలికి ఇవ్వమని నాకు అధికారం ఇచ్చావా రిషి అని జగతి మనసులో అనుకుంది. జగతి అది మా అత్తయ్య గారి చీర.. దానికి కాస్త పసుపు కుంకుమ అద్ది ఇవ్వు అని దేవయాని అంటుంది.. ఈ టైంలో మీ పెదనాన్న కూడా ఉంటే చాలా బాగుండేది రిషి.. ఈపాటికి వసుధార వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడేసి ఉండేవాడు అని దేవయాని అంటుంది ఇప్పుడు అవన్నీ ఎందుకులే వదినగారు అని మహీంద్రా అంటాడు.. వసుధార మనసులో మాత్రం రకరకాల ఆలోచనలు సంధిస్తున్నాయి.. తను ఆ చీరను తీసుకోవడానికి సుముఖతగా లేదు.. తీసుకో వసు.. ఇలా మా అత్తగారి చీర.. నా చేతుల మీదుగా నీకు ఇవ్వడానికి నేను నా భాగ్యంగా భావిస్తున్నాను అని జగతి అంటుంది.. మొత్తానికి వసుధార జగతి చేతుల మీదుగా ఆ చీరను తీసుకుంటుంది..

Guppedanta Manasu 14 oct today full Episode
Guppedanta Manasu 14 oct today full Episode

పైకి వెళ్లిన వసుధార ఆ చీరను కట్టుకోవడానికి ఆలోచిస్తుంది. ఏంటి వసుధర ఆలోచిస్తున్నావు త్వరగా చీర మార్చుకొని రా అని జగతి అంటుంది.. మేడం నేను ఈ చీర కట్టుకుంటే సగం ఈ ఇంటి కోడల్ని అయినట్టే కదా అని వసుధార అంటుంది. అవును అని జగతి అంటుంది.. మరి నా మనసులో ఉన్న ఆ కోరిక సంగతి ఏంటి అని వసుధర అడుగుతుంది.. ఇప్పుడు అవన్నీ ఎందుకు చీర మార్చుకో అని జగతి అంటుంది..

రిషి సార్ నాకు ఆ మాట మీద నిలబడాలిగా కదా మేడం అని వసుధారా అంటుంది.. వసుధారా ఇలాంటి సమయంలో పంతాలు ఎందుకు చెప్పు అని జగతి అంటుంది.. పంతం కాదు మేడం మీరు రిషి సార్ ని మీరు ఒక కొడుకులా చూస్తున్నారు.. కానీ నేను ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చూడాలని అనుకుంటున్నాను..అమ్మ అని పిలవలేని ఆ మచ్చ రిషి సార్ కి ఉండకూడదు అని నా తాపత్రయం.. ఎవరైనా సరే అమ్మ గురించి అనర్గళంగా మాట్లాడగలరు.. రిషి సారుని కూడా నేనే అంతా మంచి వ్యక్తిగా చూడాలని అనుకుంటున్నాను అని వసుధర అంటుంది.. నా మాట విను వసు.. చీర కట్టుకో .. దీనిని పెద్ద ఇష్యూ చెయ్యకు అని జగతి అంటుంది..

మహీంద్రా అప్పుడే వస్తాడు నువ్వు వెళ్లి మహేంద్ర నేను వస్తాను అని జగతి అంటుంది.. తను కూడా మనసులో నా వల్లే కదా ఈ విషయం ఇంత పెద్దది అవుతుంది అని అనుకుంటాడు.. మహేంద్ర నిన్ను గురుదక్షిణ అడిగాడు.. కానీ ఆ విషయం ఇంత పెద్దది అవుతుంది అని తను కూడా అనుకోలేదు అని జగతి అంటుంది.. కావాలంటే నేను మహేంద్ర తో ఈ విషయం చెప్పిన అని అంటుంది జగతి వద్దు మేడం.. మీరు ఎవరితో చెప్పినా నేను ఈ విషయంలో తగ్గను అని వసుధారా అంటుంది.. వసు నా మాట విను ప్లీజ్ అని జగతి బ్రతిమిలాడుతుంది..