Guppedanta Manasu 05 Nov Episode : రిషికి ఆ విషయం చెబుతానని దేవయానిని బెదిరించిన వసుధర.!? జగతి నిర్ణయం ఎటువైపు..!?

Guppedanta Manasu 05 Nov Episode : వసుధర రిషి ఇద్దరు కలిసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు.. ఇక ఆ దీపాలు వెలిగించడం వెనుక ఉన్న ఆంతర్యం గురించి రిషికి వసుధర వివరించి చెబుతుంది.. వసుధర నా జీవితంలో ఉన్న చీకటిని తొలగించడానికి నువ్వు నా జీవితంలోకి వచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది అని రిషి అంటాడు.. నేను మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోను రిషి సార్.. మన ఇద్దరం ఒకటే రిషి సార్.. నేను మీ నీడను రిషి సార్ అని వసుధార అంటుంది.. వసుధర మెట్లు మీద నుంచి దిగి వస్తుండగా దేవయాని తన ఎదురుగా నిలబడి ఉంటుంది..

Guppedanta Manasu 05 nov today full  Episode
Guppedanta Manasu 05 nov today full Episode

ఎక్కడి నుంచి వస్తున్నావ్ వసుధారా అని దేవయాని అడుగుతుంది.. పైన రిషి కూడా ఉన్నాడా అని అంటుంది.. ఉన్నారు మేడం అని వసుధార అంది అర్ధరాత్రి ఈ చీకటిలో డాబా పైన మీరిద్దరూ ఏం చేస్తున్నారు అని దేవయాని వసుధార ను అడుగుతుంది.. మేడం మీరు మీ మాటలను అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.. రిషి సార్ తో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు అని వసుధార అంది.. నేను ఎవ్వరితోనూ నేను ఎప్పుడు హద్దులు దాటి ప్రవర్తించను.. నా లిమిట్స్ లో నేను ఉంటాను అని వసుధార దేవయానితో అంది..

మేడం మీరు ఇంతకుముందు ఒకసారి నాతో ఇలాగే మాట్లాడారు.. కానీ నేను అప్పుడు ఊరుకున్నాను..మీరు ఇలాగే ప్రతిసారి మాట్లాడితే నేను ఊరుకోను అని వసుధార అంటుంది.. హా.. ఏం చేస్తావు అని దేవయాని గట్టిగా అడుగుతుంది.. మేడం నేను ఈ విషయాలన్నీ రిషి సార్ తో చెప్పడానికి నాకు క్షణం పట్టదు అని వసుధార అంటుంది.. కానీ ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం నా స్వభావం కాదు.. అది నా వ్యక్తిత్వం , మనస్తత్వం కాదు మీకు అర్థమయ్యేలా చెబుతాను వినండి.. రిషి సార్ తో ఉండే హక్కు నాకుంది.. రిషి సార్ నా జీవితం.. తనతో పాటు కలిసి నేను జీవితాంతం ప్రయాణం చేస్తాను.. పద్ధతులు హద్దుల గురించి ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని వసుధారా దేవయాని తో అంటుంది.. మీకు నేను చాలా సార్లు చెప్పాను మీరు అనవసరంగా మా మీద లేనిపోయినవి ఊహించుకొని నిఘా పెట్టి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.. మీరు అన్న మాటలని నేను రిషి సార్ తో చెప్పడానికి నాకు క్షణం పట్టదు.. పైగా పెద్ద పని కూడా కాదు అని వసుధర అంటుంది.. మీరు అక్కడ వరకు తెచ్చుకోరని నేను అనుకుంటున్నాను.. గుడ్ నైట్ మేడం అని వసుధర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

ఏం విడిచి పడుతున్నావు సుధారా రిషి నీ వైపు ఉన్నాడనే కదా నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావు సాధిస్తాను మళ్ళీ నేను సాధిస్తాను అప్పుడు నా సంగతేంటో నీకు తెలుస్తుంది అని దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు రిషి నిద్ర పట్టక వసుధర ఏం చేస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు వసుధార కూడా రిషి ఏం చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రిషి దగ్గర నుంచి వసుధారకి మెసేజ్ వస్తుంది అలా ఇద్దరూ చాట్ చేసుకుంటూ వసుధార రిషి రూమ్ దాకా వస్తూ మీకు ఐ లవ్ యు అని చెప్పాలని ఉంది అని అంటుంది.. అలా ఇద్దరు ఒకరి తలకు ఒకరు కొట్టుకుంటారు.. సరే వెళ్లి పడుకో వసుధారా అని రిషి అంటాడు..

జగతి మేడం గౌతమ్ కి ఫోన్ చేసి రిషి మాకు అఫీషియల్ గా మెయిల్ పంపించాడు.. మిషన్ ఎడ్యుకేషన్ నుంచి కచ్చితంగా మేము మినిస్టర్ గారి దగ్గరికి మీటింగ్ కి హాజరు అవ్వక తప్పదు అని జగతి గౌతమ్ తో చెబుతుంది.. మేడం ఇప్పటికైనా రీషిని బాధ పెట్టకుండా మీరు అక్కడికి వస్తే మంచిది అని గౌతమ్ అంటాడు.. ఇక అంకుల్ ను వదిలిపెట్టి ఎక్కువ రోజులు ఉండటం రిషి వల్ల కాదు అని జగతి మేడంకి గౌతమ్ సలహా ఇస్తాడు..

వసుధార తలస్నానం చేసి తల ఆరబెట్టుకుంటూ ఉండగా.. రిషి హెయిర్ డ్రయర్ తో తనకు హెయిర్ డ్రై చేసే ప్రయత్నం చేస్తాడు.. అదేంటి సార్ ఇందాక నేను ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదు అని వసుధారా అంటుంది.. స్విచ్ కూడా ఆన్ చేయాలి వసుధారా అని రిషి అంటాడు.. సరే ఇవ్వండి సార్ నేను హెయిర్ డ్రై చేసుకుంటాను అని వసుధార అంటుంది.. ఏంటి సార్ మీరు నాకు ఇలా సేవ చేయటం.. అని వసుధార అంటుంది.. ఎప్పుడు నువ్వేనా నాకు సేవలు చేయడం నేను నీకు సేవలు చేయొద్దా అని రిషి అంటాడు.. అలా ఇద్దరు కలిసి ఒకే సోఫాలో ఒకరి మీద ఒకరు పడిపోతారు..