Intinti Gruhalakshmi :ఇంటింటి గృహలక్ష్మి వచ్చేవారం ఈ సూపర్ ట్విస్ట్ ఉంటుందని మీకు తెలుసా.!?

Intinti Gruhalakshmi : విభిన్నమైన కథ కథనాలతో సారమవుతున్న ఇంటి గృహలక్ష్మి సీరియల్ కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో దూసుకుపోతుంది.. గత కొన్ని వారాలుగా మంచి టిఆర్పి రేటింగ్ తో మూడవ ప్లేస్ లో నిలుస్తూ వస్తోంది.. తులసి పాత్రకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.. ఈ సీరియల్ లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

సామ్రాట్ కి సునంద అనే చెల్లెలు ఉంది.. సునంద కూతురు హానిని సామ్రాట్ గుమ్మం ముందు వదిలిపెట్టి ఆత్మహత్య చేసుకుంది.. ప్రాణంతో సమానంగా పెంచుకున్న తన చెల్లి దూరమవ్వడంతో సామ్రాట్ చాలా బాధపడ్డాడు.. సామ్రాట్ హనీ కోసమే బ్రతకాలని నిర్ణయించుకున్నాడు.. అప్పటినుంచి తనే హనీకి తండ్రి అయ్యాడు..

సామ్రాట్ తులసి మధ్య ఏదో ఉందని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే తప్పులేదు అని రకరకాల పెడ్దార్థాలు తీస్తూ న్యూస్ వస్తుంది.. అభి కోపంగా మళ్లీ ఇదంతా ఏంటి అని తులసిని ప్రశ్నిస్తాడు.. ఆల్రెడీ పొద్దున్నే క్లారిటీ ఇచ్చాను కదా అని తులసి అంటుంది.. నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ అది బయటకు చెప్పడం నాకు చేతకాదు నువ్వు నాకు ఆస్తి రాకుండా చేసేవన్నా బాధ ఉంది కానీ అది నీ మీద కోపంగా ఎప్పుడూ మార్చుకోలేదు అని అభి మొదటిసారి ఎమోషనల్ అవుతాడు.. నేను ప్రమాదం లో పడ్డ ప్రతి సారి నువ్వే నన్ను కాపాడావు.. వాళ్లంతా నన్ను అలా చూడటం నాకు బాధగా అనిపిస్తుంది.. నువ్వైనా నన్ను అర్థ్మం చేసుకో మామ్ అని అభి ఏడుస్తాడు..

Did you know that the next week of Intinta Grilahakshmi will have this super twist
Did you know that the next week of Intinta Grilahakshmi will have this super twist

అనసూయమ్మ సామ్రాట్ దగ్గరకు వెళ్ళి తులసిని వదిలేయమని చెబుతుంది.. ఆఫీసులో ఉద్యోగం కూడా మీరే కదా ఇచ్చింది కాబట్టి తగతెంపులు కూడా జరగాలి అని అనసూయమ్మ అంటుంది. ఇన్ని రోజులు నుంచి ఇంతగా సపోర్ట్ చేసి ఇప్పుడు వెన్నుపోటు పొడవడం ఏమైనా బాగుందా.. తులసి మంచి కోసమే కదా ఇదంతా చేస్తుంది. ముఖ్యంగా మా ఇంటి పరువు రోడ్డు మీద పడకూడదు అని ఇలా చేస్తున్నాను అని అంటుంది.. నిన్నే కదా అమ్మ అంత ధైర్యంగా మాట్లాడింది.. మీరందరూ ప్లాప్స్ కూడా కొట్టారు అని సామ్రాట్ అడుగుతారు.. బుద్ధి తక్కువయి అప్పుడు చప్పట్లు కొట్టాము.. అందుకే ఇప్పుడు చెంపలు కొట్టుకుంటున్నాను అని సామ్రాట్ ముందు చంపలు వాయించుకుంటుంది అనసూయమ్మ.. అమ్మ అని సామ్రాట్ పెద్దగా అరుస్తాడు.. తులసి ఎదగడం కన్నా కూడా పరువుగా బ్రతకడం ముఖ్యం అనుకుంటున్నాను.. అసలు తులసి గారు చేసిన దాంట్లో పరువు తక్కువ పని ఏముంది అమ్మ అని సామ్రాట్ అంటాడు.. మీరు గొప్పోళ్ళు బాబు మీ చుట్టూ ఓ మంచి కోటను కట్టుకొని ప్రశాంతంగా ఉంటారు.. దయచేసి మా తులసిని మీ ఆఫీస్ నుంచి బయటకు పంపించండి అని అంటుంది..

ప్రేమ్ సామ్రాట్ చెప్పిన ఆఫీస్ కి మ్యూజిక్ ఆడిషన్ కోసం వెళ్తాడు.. ప్రేమ్ ని వాళ్ళు కావాలని సెలెక్ట్ చేస్తారు.. ఆ పక్కనే ఉన్న వాళ్ళందరూ ప్రేమకి కంగ్రాట్స్ చెబుతారు.. మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని ప్రేమని లోపలికి పిలుస్తాడు ప్రేమ్ ఆనందంగా లోపలికి వెళ్తుండగా.. ప్రేమ్ కి ఒక వ్యక్తి అడ్డుపడతారు హలో కాస్త తప్పకుండా నేను లోపలికి వెళ్తాను అని అంటాడు.. ఒకరికి రావాల్సిన ఛాన్స్ మీరు అన్యాయంగా కొట్టేశారు రికమండేషన్ తో కాదు నేరుగా ఢీ కొట్టాలి అని తను అంటాడు.. ఇక ప్రేమ్ ముందు అతను వాళ్ళ అమ్మ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడతారు ప్రేమ అతన్ని కొడతాడు.. ఇక వాళ్ళిద్దరూ కొట్టుకోవడంతో పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్తారు ప్రేమ పోలీసులు అరెస్టు చేస్తారు.. సామ్రాట్ వచ్చి విడిపిస్తాడు..

తులసి ఆఫీసులో ఒక ఫైల్ మీద తెలియకుండా సంతకం పెడుతుంది. అంతా జాగ్రత్తగా ఎలా ఉన్నావ్ తులసి అని నందు తులసిని ప్రశ్నిస్తాడు.. థాంక్యూ నందు మీరు ఈ విషయం మీది కాదైనా కంపెనీ రేపిటేషన్ కాపాడడం కోసం ఈ విషయాన్ని బయటకు వెళ్లకుండా కాపాడినందుకు పది లక్షల ఫైల్ మీద నాతో అవసరం లేకుండా తులసి దాకా ఎవరు తీసుకు వెళ్లారు అని సామ్రాట్ అడుగుతాడు.. ఆ విషయం సామ్రాట్ కి తెలిసి పెద్ద గొడవ జరుగుతుంది. ఇక ఆ విషయాన్ని నందు పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. తులసి ఆ విషయాన్ని రమ్మను అడిగి తెలుసుకుంటుంది. ఇదంతా ఎవరు చేశారు నువ్వే కావాలని చేసావా నీ చేత ఎవరైనా చేయించారని అడుగుతుంది. నీ జాబ్ కి ఎలాంటి ప్రమాదం ఉండదు అసలు ఏం జరిగిందో చెప్పమని తులసి తనని అడుగుతుంది.. ఓ పక్క లాస్య తులసి రమ్యను అడుగుతున్న మాటలను వింటుంది. తన కుట్రా తెలిసిపోతుందేమోనని కంగారు పడుతుంది.. తులసి నీ అనసూయమ్మ కోరిక మేరకు సామ్రాట్ బయటకు పంపిస్తాడు.. మళ్ళీ ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతుంది.. సామ్రాట్ ఆ విషయం తులసికి చెప్పరు కానీ తులసి అనసూయమ్మ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేలాగా చేసింది అని తెలుసుకుంటుంది.. ఇదే వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ కానుంది..