Bigg Boss 6 Telugu : ” అక్కడ ముట్టుకుంటా ” బిగ్ బాస్ షో నా ఇంకేమన్నానా ఇది .. ఛీఛీ !

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్ లో ఈసారి తెలుగులో సీజన్ 6 ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇక నిజానికి బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక విలాసవంతమైన ఇల్లు.. చుట్టూ పదుల సంఖ్యలో కెమెరాలు .. కంటెస్టెంట్లుగా కొంతమంది సెలబ్రిటీలు.. నిర్వాహకులు ఇచ్చే టాస్క్లను గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  ముఖ్యంగా టాస్క్ లో భాగంగా వీరు ఇచ్చే పర్ఫామెన్స్ తోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి తమ వంతు కృషి చేయాల్సి ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ షో కి ప్రేక్షకుల మద్దతు భారీ స్థాయిలో లభిస్తూ ఉండడం గమనార్హం. మిగతా ఐదు సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 6 చాలా వరస్ట్ గా మారిపోయిందనే చెప్పాలి.

అంతేకాదు దీనిపై కొంతమంది బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్లు చేయడమే కాకుండా హైకోర్టులో ఈ షో ఆపివేయాలని కేసు కూడా ఫైల్ చేశారు.. ఇకపోతే బిగ్ బాస్  లోకి అడుగుపెట్టిన చాలామంది కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాకులు మరింత ఎలివేట్ చేస్తూ వారు నిజంగానే ప్రేమించుకుంటున్నారేమో అన్నట్టుగా సృష్టిస్తారు. ఇక అంతే కాదు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో స్పందన దక్కుతుండడంతో చాలామంది కంటెస్టెంట్ల మధ్య ఇలా లవ్ ట్రాక్ నడిపే ప్రయత్నం చేస్తోంది బిగ్ బాస్. ఇక  ఎంతో మంది జంటలుగా మారి తెలుగు రాష్ట్రాలలో బాగా గుర్తింపును తెచ్చుకుంటున్నారు.  ఇక ఈ క్రమంలోనే.. మెరీనా- రోహిత్ రియల్ కపుల్ గా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టగా.. మిగిలిన వాళ్ళలో ఆర్జే సూర్య , ఆరోహి ఒక జంట,  అర్జున్ కళ్యాణ్ – శ్రీ సత్య మరొక జంటగా మారారు.

audiences Comments on Bigg Boss 6 Telugu Show
audiences Comments on Bigg Boss 6 Telugu Show

ఇక ఈ సీజన్లో శ్రీ సత్య బాగా హైలైట్ అయింది అంతేకాదు ఇంప్రెస్ చేయడానికి అర్జున్ కూడా ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాడు కానీ ఆమె మాత్రం అతడిని లైట్ తీసుకుంటుంది.. కానీ  శ్రీ సత్య.. అర్జున్ కి అన్నం కూడా తినిపించింది. ఇకపోతే ఈ బీబీ హోటల్ టాస్క్ లో అర్జున్ కళ్యాణ్ నుంచి శ్రీ సత్య కు తప్ప మిగిలిన వాళ్లకు పెద్దగా టిప్స్ రాలేదు. దీంతో లేడీ టీం లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ అతడితో విమర్శలు చేశారు.. ఇక ఇదంతా ఇలా ఉండగా అర్జున్.. శ్రీ సత్య వ్యవహారంపై ఆరోహి, కీర్తి, మెరీనా, రోహిత్ మీటింగ్ పెట్టారు. ఇక అందులో వీళ్ళు అర్జున్ .. శ్రీ సత్య తో ఎక్కువగా ఉన్నాడు .. ఆమెను ముద్దు పెట్టమని .. అన్నం తినిపించమని సతాయిస్తున్నాడు. టిప్స్ వస్తున్నాయని సత్య కూడా కొన్నింటిని ఒప్పుకుంది అంటూ అర్జున్ పై ఆరోపణలు చేయడం గమనార్హం. ఇక మొత్తానికైతే రోజు రోజుకు ఇలాంటివి ఎక్కువవుతే కచ్చితంగా ఈ షో చూసే వారి సంఖ్య కూడా తగ్గిపోతుందని చెప్పవచ్చు.