Bigg Boss 6 Telugu : వామ్మో వైల్డ్ కార్డ్ లో ఈ అమ్మాయిని పట్టుకొస్తున్నారా.. హౌస్ లో యుద్ధాలు గ్యారెంటీ..??

Bigg Boss 6 Telugu బిగ్ బాస్.. దేశంలోని పాపులర్ రియాల్టీ షోలలో ఒకటి. హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు బాషల్లోనూ సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాగ్ షో ఆరవ సీజన్ నడుస్తోంది. టాలీవుడ్ టాప్ స్టార్ నాగార్జున హోస్ట్చేస్తున్నారు. బిగ్ బాస్ షోలతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు కంటెస్టెంట్స్. సినిమాల్లోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయిందో దాని చుట్టూ విమర్శలు అదే రేంజ్ లో ఉంటాయి.. బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు వైల్డ్ గార్డ్ ఎంట్రీ తో ఎలిమినేట్ అయిన వారు ఎవరైనా రావచ్చు..!!

బిగ్ బాస్ సీజన్ 6 మొదలై మూడు వారాలు పూర్తి చేసుకుంది.. ఇప్పటికే ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం షాని, అభినయశ్రీ.. నేహా ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.. అభినయశ్రీ బిగ్ బాస్ షో ద్వారా తనకు రీ లైఫ్ వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నానని ఈ షో నన్ను చాలా నిరాశపరిచిందని బయటకు వచ్చాక వాపోయారు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ వస్తే మీరు తప్పకుండా వెళ్తారా అని ప్రశ్నిస్తే తప్పకుండా వెళ్తాను.. నాకు నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం మరోసారి వచ్చిందని అనుకుంటాను అని చెప్పింది.. అంతేకాకుండా హౌస్ లో కొంతమంది లెక్కలు తేల్చాలి.. అవన్నీ సెట్ చేస్తాను అని అభినయశ్రీ తాజాగా మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది..

Bigg Boss 6 Telugu wild card entry on female contestant
Bigg Boss 6 Telugu wild card entry on female contestant

మూడో వారంలో ఎలిమినేట్ అయిన నేహా చౌదరి కూడా అసలు ఇంత త్వరగా నేను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు.. బయట బిగ్ బాస్ హౌస్ గురించి ఒకలాగా చెప్తే.. బిగ్ బాస్ హౌస్ లో కచ్చితంగా గేమ్ ఆడితేనే ఆదరిస్తారని నాకు బయటకు వచ్చాక తెలిసింది అని ఎన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేహా చౌదరి చెప్పింది.. అయితే వైల్డ్ కార్డు ద్వారా రీ ఎంట్రీ ఇస్తారా అని చెబితే తప్పకుండా ఇస్తాను అని నేహా చెప్పింది.. అయితే హౌస్ లోకి వెళ్ళాక ఎవరి మీద పగ తీర్చుకుంటారు అని అడగగా.. ఒక్కరి పేరు అని చెప్పను.. కానీ వాళ్లలో చాలామంది లెక్కలు తేల్చాల్సి ఉంది వాళ్లందరి వాట వాళ్ళకి ఇచ్చే వస్తాను అని నేహా అంది.. కచ్చితంగా అభినయశ్రీ కానీ నేహా కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్తే మాత్రం రచ్చ రచ్చ అవడం ఖాయం.. వీళ్ళిద్దరి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ టిఆర్పి రేటింగ్ పెరిగేలా చేయాలనీ కొత్త వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.. మరి ఈ ఇద్దరిలో ఎవరు వెళ్తారు అనేది క్లారిటీ లేదు..