lost Mobile Recovery : ” Hi” అని మెసేజ్ చేస్తే చాలు.. పోయిన మొబైల్ ను వెతికిస్తామంటున్న పోలీసులు.. ఇదిగో ప్రూఫ్..!!

lost Mobile Recovery ఈ మధ్యకాలంలో మొబైల్ చోరీ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతోమంది తమ మొబైల్ ను పోగొట్టుకోవడం వల్ల పలు రకాలుగా ఇబ్బంది పడుతూ ఉండడం మనం తరచూ చూస్తూనే ఉన్నాము. అయితే మొబైల్ పోయిన తర్వాత దొరకడం అంటే అది చాలా అరుదైన విషయమని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విజయనగరం, కర్నూల్ పోలీసులు ఎవరిదైనా మొబైల్ చోరీ జరిగినా.. మిస్సయినా కూడా మేము వెతికి ఇస్తాము అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఇక వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పోగొట్టుకున్న లేదా చోరీ అయిన మొబైల్స్ ను పోలీసులు వెతికి ఇస్తున్నారు. ఇటీవల కొన్ని వందల మందికి ఇలాంటి సౌకర్యాన్ని కల్పించారు. పోగొట్టుకున్న మొబైల్ ను కేవలం 15 నుంచి 30 రోజులలోపై వెతికి ఇస్తామని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా లోని పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని తెలియజేస్తున్నారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే ఏం చేయాలో అన్ని విషయాలను కూడా వివరించడం జరిగింది.8977945606 అనే మొబైల్ నెంబర్ కి వాట్సప్ ద్వారా హెల్ప్ అని కానీ హాయ్ అని కానీ మెసేజ్ చేస్తే రిటర్న్ గా రీజనబుల్ సైబర్ క్రైమ్ నుంచి ఒక లింక్ వస్తుందట.

Just send a message saying "Hi".. The police say they will find the lost mobile.. Here is the proof.
Just send a message saying “Hi”.. The police say they will find the lost mobile.. Here is the proof.

అలా లింకు మీద ఓపెన్ చేయగానే ఒక పోర్టల్ ఓపెన్ అవుతుందట. అయితే ఆ లింకు ఓపెన్ అయిన తర్వాత అందులో మన డేటా అంత ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలామందికి మొబైల్ యొక్క IMEI నెంబర్ తెలియకపోవచ్చు. అయినా కూడా ఇబ్బంది లేదని తెలియజేస్తున్నారు పోలీసులు. అయితే మొబైల్ పోయినప్పుడు అందులో ఉన్న నెంబర్ ని చెప్తే ట్రేస్ చేస్తామని తెలియజేస్తున్నారు పోలీసులు. అయితే IMEI నెంబర్ తెలియనప్పుడు డైరెక్టుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వవచ్చట.

అయితే మీ యొక్క డేటా భద్రత కోసం మొబైల్ పోయిన వెంటనే సైబర్ క్రైమ్ వారు కొన్ని సూచనలను తెలియజేస్తున్నారు. CEIR అనే వెబ్సైట్లో మొబైల్ యొక్క IMEI నెంబర్ ని కూడా బ్లాక్ చేస్తారు. దానిద్వారా మొబైల్ వారు ఉపయోగించకుండా మనం ఆపవచ్చు. అయితే మొబైల్ పోయినట్లు కేవలం వాట్సాప్ ద్వారానే కాకుండా వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చట. ఇక వీటికోసం విజయనగరం జిల్లా , కర్నూలు జిల్లా పోలీసులు ఒక వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. vzmmobiletracker.in, kurnoolpolice.in/mobiletheft అనే వెబ్సైట్ ద్వారా ఈ జిల్లాలలోని ప్రజలు కంప్లైంట్ చేయవచ్చు. కేవలం బేసిక్ సమాచారం ఇస్తే చాలు మీ మొబైల్ నీ కనిపెడతామని తెలియజేస్తున్నారు.