Smart TV Offers : రూ.6 వేలకే స్మార్ట్ టీవీ.. ఆఫర్ ఎలా పొందాలంటే..?

Smart TV Offers  ఇటీవల కాలంలో చాలామంది కొత్త టీవీలు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. అలాంటివారిలో మీరు కూడా ఒకరైతే మీకోసం అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా ఈ కామర్స్ దిగ్గజాలు స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ లను ప్రకటిస్తూ మరింతగా కష్టమర్లకు దగ్గరవుతున్నాయి. ఈ క్రమంలోనే మీరు కూడా టీవీ కొనుగోలు చేయాలనుకుంటే.. కేవలం రూ.6000కే స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయ సంస్థ క్రోమా ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఈటీవీ ని క్రోమో వెబ్సైటు ద్వారా సొంతం చేసుకోవచ్చు. మరీ అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం కూడా.

Get smart TV at only Rs.6000..
Get smart TV at only Rs.6000..

క్రోమా వెబ్సైటులో ఫాక్స్ స్కై స్మార్ట్ టీవీ అసలు ధర రూ.22,499 అయితే కేవలం రూ. 6,740 సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు ఈ టీవీలో ఏకంగా 70% తగ్గింపుతో పొందవచ్చు 32 అంగుళాల హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ 2021 మోడల్ కు ఈ ధర వర్తిస్తుంది. అంతే కాదు ఈ టీవీ పై మరెన్నో ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీ పై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు సమాచారం.. హెచ్ ఎస్ బి సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా.. 7.5% తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఫెడరల్ బ్యాంకు కస్టమర్ లు, క్రెడిట్ కార్డు ఉపయోగించి ఈ టీవీ కంటే 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు కస్టమర్లకి కూడా ఈ డిస్కౌంట్ లభిస్తూ ఉండడం గమనార్హం.

అంతేకాదు నెలవారీ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.60 Hz రిఫ్రెష్ రేట్ తో..2HDMI పోర్ట్, 2USB పోర్ట్ తోపాటు ఆండ్రాయిడ్ OS, వైఫై, డాల్బీ ఆడియో, 30W స్పీకర్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.