Prabhas : ప్రభాస్ నిజంగా బంగారం .. పొగడ్తలతో ముంచేస్తోన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ !

Prabhas :ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. చివ‌రిగా భీమ్లా నాయ‌క్ చిత్రంతో ప‌ల‌క‌రించిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్‌తో క‌లిసి భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ చిత్రం చేయ‌నున్నాడు. అయితే తాజాగా పవన్ ఫ్యాన్స్ హుషారెత్తిపోయే మరో బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అతిత్వరలో మరో భారీ సినిమాలో పవన్ భాగం కాబోతున్నట్లు డీవీవీ సంస్థ త‌మ సోష‌ల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

pawan-fans-praise-on-prabhas
pawan-fans-praise-on-prabhas

ప్ర‌భాస్ పై పవ‌న్ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు..

డీవివి దానయ్య నిర్మాణంలో ప్రభాస్ తో సాహో లాంటి హాలీవుడ్ మేకింగ్ సినిమా తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా రూపొంద‌నుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేయ‌గా, ఇది తెగ వైర‌ల్ అయింది. తాజాగా ఈ పోస్టర్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.ఆసక్తికర కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్- సుజీత్ వాట్ ఏ కాంబినేషన్.. ఫస్ట్ లుక్ అదుర్స్ అంటూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు రామ్ చరణ్. ఇక ఎవ‌రు ఊహించ‌ని విధంగా ప్ర‌భాస్ కూడా ప‌వ‌న్ సినిమా అనౌన్స్‌మెంట్‌పై స్పందించారు.

‘‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, సుజీత్‌కి నా అభినందనలు. ఈ కాంబినేషన్ దద్దరిల్లిపోతుంది. దానయ్య గారికి, చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ప్రభాస్ శుభాకాంక్షలపై డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘‘మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు ప్రభాస్ గారు. మీరు స్పందించడం మాకు గొప్ప విషయం’’ అంటూ సంతోషం వెల్ల‌బుచ్చింది. అయితే ప్రభాస్ విషెస్‌పై పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తూ… ప్రభాస్‌కు థాంక్స్ చెప్తున్నారు. ప్ర‌భాస్ బంగారం అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా, ప‌లు సంద‌ర్భాల‌లో ప్ర‌భాస్‌ని కూడా ప‌వ‌న్ ఆకాశానికి ఎత్తిన విష‌యం తెలిసిందే.