Flipkart Black Friday Sale : తక్కువ బడ్జెట్లో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!

Flipkart Black Friday Sale  ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో బ్లాక్ ఫ్రైడే సేల్ ముగిసిన కూడా ఇంకా స్మార్ట్ టీవీల పైనే కాదు స్మార్ట్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటే తక్కువ బడ్జెట్లో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Get Best smartphones at budget price..!
Get Best smartphones at budget price..!

ప్రస్తుతం వినియోగదారులు ఐసిఐసిఐ బ్యాంకు కార్డులు, కోటక్ బ్యాంకు కార్డులు అలాగే సిటీ బ్యాంకు కార్డు ద్వారా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే 12 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే సేల్ సమయంలో ఎక్స్చేంజ్ ఆఫర్లు , నో కాస్ట్ ఈ మరియు స్క్రీన్ డామేజ్ ప్రొటెక్షన్ కూడా మీరు పొందవచ్చు. ఇదే కాకుండా ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు పే లేటర్ ఆప్షన్ కూడా లభిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఆపిల్ ఐఫోన్ 13, నథింగ్ ఫోన్ వన్ మరియు ఇతర స్మార్ట్ ఫోన్ లపై భారీ తగ్గింపు ధరలను అందివ్వడం గమనార్హం. మీరు కూడా కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే వీటిని ఒకసారి పరిశీలించండి.

ఆపిల్ ఐఫోన్ 13:

ఆపిల్ ఐఫోన్ 13 యొక్క బేస్ మోడల్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ.62,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ A15 బయోనిక్ చిప్ సెట్ తో ఆధారితమైనది. 6.1 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్లో 12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా సెట్ అప్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి రూ.17, 500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

నథింగ్ ఫోన్ (1):

ప్రస్తుతం 8 GB + 128 GB స్టోరేజ్ మోడల్ ఫ్లిప్కార్ట్ లో రూ.27,499కి విక్రయించబడుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి స్క్రీన్ కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఆఫర్లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కూడా అమర్చబడి ఉంది.