210 W Fast Charging Smart Phone : మొదటి సారి 210 W ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్ .. పది నిమిషాల్లో ఫుల్ ఛార్జ్..!

210 W Fast Charging Smart Phone :  సాధారణంగా స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యవసరంగా మారిపోయింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ చూస్తున్నంత సేపు మొబైల్ లో ఛార్జింగ్ ఉందో లేదో కూడా కొంతమంది చూసుకోవడం మర్చిపోతూ ఉంటారు. ఉన్నట్టుండి ఛార్జింగ్ అయిపోతే ఇక మనం ఏదైనా ఆసక్తిగా సినిమా వీక్షించడం సీరియల్ లేదా ఇతర ఏదైనా విషయాలపై ఫోకస్ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే మన మూడ్ కూడా ఆఫ్ అవుతుందని చెప్పవచ్చు. అంతేకాదు ఫుల్ బ్యాటరీ చార్జ్ చేయాలి అంటే ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు..అలాంటప్పుడు తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ అవుతూ ఎక్కువ కాలం బ్యాకప్ ఇచ్చే బ్యాటరీ లైఫ్ కావాలని కోరుకుంటారు అలాంటి వారి కోసమే మొదటిసారి రెడ్మీ ఏకంగా 210 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో బ్యాటరీని అందిస్తోంది. కేవలం పది నిమిషాల ఛార్జింగ్తో బ్యాటరీ ఫుల్ చేసుకోవచ్చు.

First time 210 W charging smart phone .. full charge in ten minutes
First time 210 W charging smart phone .. full charge in ten minutes

ఇక రెడ్మి నుంచి విడుదల చేసిన రెడ్మి నోట్ 12 సిరీస్ ప్రో ప్లస్ ఫోన్ 210 W చార్జింగ్ సపోర్ట్ తో రావడం గమనార్హం. తాజాగా రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 12 సిరీస్ లో ఈ ఫోన్ విడుదల కానుంది. ఇక రెడ్మి నోట్ 12 అండ్ రెడ్మీ నోట్ 12 ప్రో కూడా ఈ సిరీస్ కింద లాంచ్ అవుతున్నాయి. ఈ నెలలో రెడ్మి నోట్ 12 సీరీస్ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి సిద్ధమైంది ఈ చైనా కంపెనీ. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో 150W చార్జింగ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ రెడ్మి నోట్ 12 సిరీస్ ప్రో ప్లస్ ఫోన్ 210 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నాయి.

 

ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే..120 Hz రిఫ్రెష్ రేటుతో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక 4300 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ ప్రో ప్లస్ మోడల్ తో, 4980 ఎం ఏ హెచ్ బ్యాటరీతో ప్రో రానుంది. కెమెరా సెట్ అప్ విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ తో లభిస్తుంది. అంతేకాదు మరికొన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని కూడా కంపెనీ స్పష్టం చేసింది.