GUDIVADA AMARNATH : గుడివాడ అమర్నాథ్ వీడియో చూస్తే ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూడండి..

GUDIVADA AMARNATH :బ్రేకింగ్ న్యూస్ హైయెస్ట్ ట్రోలింగ్ మంత్రిగా రికార్డులకు ఎక్కిన గుడివాడ అమర్నాథ్ అంటూ.. కొంతమంది ట్రోలర్స్ గుడివాడ అమర్నాథ్ గతంలో చేసిన వ్యాఖ్యలను పోలుస్తూ.. మరికొన్ని ట్రోల్స్ యాడ్ చేసి ఓ వీడియోను పోస్ట్ చేయగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అందులో యాంకర్ పవన్ కళ్యాణ్ ను మీతో ఎక్కువగా పోల్చుకుంటూ ఉంటారు కదా.. ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ మీ ఇద్దరూ కలిసి రోడ్డుమీదకి వెళితే జనాలు ఎక్కువగా ఎవరు సెల్ఫీలు తీసుకుంటారు అని అడగగా.. మీ ఇద్దరం రోడ్డు మీదకి వెళ్తే నాతోనే ఎక్కువగా సెల్ఫీలు తీసుకోవడానికి ఇష్టపడతారు జనాలు అంటూ.. అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను పబ్లిక్ టాక్ తో మిక్స్ చేసి ఓ ట్రోల్ వదిలారు..

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్ ని తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం అని గుడివాడ అమర్నాథ్ అనగా.. ఆ మాటలకు మరో ఫన్నీ జోక్ ఆడ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కంటే మీరే ఎక్కువ శక్తివంతులు అంటారు అంతేనా అని అమర్నాథ్ ను అడగగా.. రాజకీయాల్లో ఆయన కంటే నేనే బెటర్ అని నా ఫీలింగ్ అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్లో ఉండే 175 టాస్క్ కి సంబంధించిన ప్రశ్నలు మీరు చెబుతారా అని అడగగా .. నేను చెప్పగలను కానీ నేను మీకు ఎందుకు చెప్పాలి అని అమర్నాథ్ అన్న వ్యాఖ్యలను కూడా మన రోలర్స్ ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. మీరు నా ట్రోలింగ్స్ ని చూస్తున్నారు కానీ నేను చేసిన వ్యాఖ్యలను గమనించడం లేదు అంటూ యాంకర్ ను సూటిగా ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. కొంతమంది ఈ ట్రోల్స్ ను ఫన్నీగా తీసుకుంటున్నారు. మరి కొంతమంది ఎవ్వరికీ రాని పాపులారిటీ మీకు ఏ విధంగా వచ్చింది అంటూ గుడివాడ అమర్నాథ్ పై సెటైర్స్ వేస్తున్నారు.

ఏపీలో ఇలాంటి కార్ రేసింగ్ ఈవెంట్లు ఎప్పుడు నిర్వహిస్తారని మీడియా మిత్రులు అడుగగా.. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది‌ అది పెట్ట కావడానికి టైం పడుతుందని ..మరోసారి తనదైన శైలిలో ఏపీ మంత్రి అమర్నాథ్ స్పందించారు. దాంతో మీమర్స్, ట్రోలర్స్ ఈ మాటల్ని ట్రోల్ చేస్తున్నారు.