Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ??దానికి ఫాన్స్ ఏ కారణమా ?

Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకుసరిగ్గా ఏడాదిన్నర కాలం ఉంది. ఈ మధ్య వరుస పెట్టి జరిగిన సంఘటనలను బట్టి పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడం తో పాటు ఏపీ రాజకీయాల్లో బాగా పట్టు సాధించాలి అని బస్సు యాత్రకు కూడా సిగ్నల్ ఇచ్చేసినట్టు గా తెలుస్తుంది. 2023 జనవరి నెలాఖరు నుంచి పవన్ కళ్యణ్ బస్సు యాత్ర చేయనున్నట్టు పార్టీ పెద్దలు తెలియచేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే బస్సు యాత్రకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉండటం తో పవన్ తానూ ఒప్పుకున్నా సినిమా లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు అని తెలుస్తుంది. డిసెంబర్ కి తన సినిమాలను పూర్తి చేయాలని పవన్ మేకర్స్ ని కోరినట్లుగా తెలుస్తుంది. సినిమా షూటింగ్స్ ని పెండింగ్ లేకుండా పూర్తి చేసుకుని జనవరి నెలాఖరుకు పార్టీకే మొత్తం సమయం కేటఇంచాలి అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అని సన్నిహిత నాయకులూ చెబుతున్నారు. దీని వెనుక ఉన్న కారణం బస్సు యాత్ర అనేది ఒకసారి మొదలైతే మొత్తం 175 నియోజకవర్గాలలో తిరిగి రావలిసింది. అదే విధం గా బస్సు యాత్ర అనేది ఒక మహా యజ్ఞం లాంటిది. ఇది చేసేటప్పుడు అన్ని రకాల వ్యయ ప్రయాసలకు తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకె షూటింగ్ ఒత్తిడి లేకుండా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.

fans-is-the-reason-for-pawan-kalyan-bus-yatra
fans-is-the-reason-for-pawan-kalyan-bus-yatra

బస్సు యాత్ర కు సంబంధించిన కార్య ప్రణాళిక మీద కూడా పార్టీ కసరత్తు చేస్తున్నట్టు గా తెలుస్తుంది. తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న జనం కోసం ఎంత కష్టానికైనా సిద్ధం అని చెప్పిన పవన్ కళ్యాణ్ పార్టీ లో చేయవలసిన ,జరగవలసిన కార్యక్రమాల మీద మరింత దృష్టి పెట్టారు అని తెలుస్తుంది. అసలు బస్సు యాత్ర దసరా రోజు నుండి మొదలు పెట్టాలి అని పవన్ అనుకున్నారు కానీ అనేక కారణాలతో అది కాస్త వాయిదా పడింది. బస్సు యాత్ర మొదలు పెట్టె లోపుగా నియోజకవర్గ స్థాయిలలో పార్టీ సమీక్షలు చేసి పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అని అంటున్నారు. ఈ మూడు నెలల కాలంలో ఇతర పార్టీల నుంచి చేరికల మీద కూడా ఫోకస్ పెట్టనున్నారట. ఇక మొత్తానికిచుస్తే మాత్రం ఇప్పుడు ఉన్న రాజకీయపు వేడి తో పాటు బస్సు యాత్రతో జనంలోకి వెళ్లడం జరిగితే 2024 ఎన్నికలలలో కచ్చితం గా విజయం సాధిస్తాము అని భావిస్తున్నారు.

అన్నింటికన్నా ముందు ఏపీ లో తిరిగి పార్టీ పరిస్థితిని అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే ఎన్నికలకు పొత్తుల తో వెళ్లాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాలని పార్టీ యొక్క వ్యూహంగా తెలుస్తుంది. తనకున్న బలాలను పరిశీలించడం తో పాటు పార్టీని మరింతంగా బలోపేతం చేసుకోవడం వలన ఏపీ రాజకీయాలో దృఢమైన పార్టీ గా మారాలన్నదే జనసేన అజెండా గా తెలుస్తుంది. పార్టీ బలోపేతం అనేది నూటికి నూరు శాతం బస్సు యత్ర ద్వారా జరుగుతుంది అని జనసేనాని నమ్ముతున్నారు. దీన్ని బట్టి చూస్తే 2023 లో జనసేన రధం ఏపీలో తిరగడం ఖాయం గా తెలుస్తుంది. దానికి అనుగుణం గా జనసైనికులు కూడా ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు ఇంత బారి ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది అందులో సందేహమే లేదు కానీ ఆ ఫాన్స్ ఎన్నికలలో ఓటు వేసి గెలిపించడం లో మాత్రం విఫలం అయి తమ అభిమాన నటుడిని ,నాయకుడిని ఓడిపోయేలా చేస్తున్నారు.. ఈ సారి అయినా పరిస్థితి మారుతుందా అలాగే ఉంటుందా అనేది వేచి చూడాలి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.