Xiaomi Mi 11 Ultra : షియోమీ.. ధర తక్కువ అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్..!!

Xiaomi Mi 11 Ultra : ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచం నలుమూలల ఏం జరుగుతోంది అనే విషయాన్ని కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో తెలుసుకోగలుగుతున్నాము. ఒక పూట భోజనం లేకపోయినా ఉండగలరేమో కాని ఒక్క క్షణం స్మార్ట్ఫోన్ చేతిలో లేకపోతే ఉండలేరు అన్నంతగా యువత బాగా అట్రాక్ట్ అయింది. ఇక ఇటీవల కాలంలో చాలా మంది యువత గేమ్స్ కి బాగా అలవాటు పడిపోయి స్మార్ట్ ఫోన్ తోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి తక్కువ ధర కి ఎక్కువ ఫీచర్లు అందించే స్మార్ట్ ఫోన్ కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మనకు కావలసిన స్మార్ట్ ఫోన్ లభించాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అని చెప్పాలి. మరి మీరు కోరుకున్నట్టు తక్కువ ధరకే అద్దిరిపోయే ఫీచర్లతో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలి అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే అలాంటి వారి కోసం షియోమీ సంస్థ ఒక అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది అని చెప్పవచ్చు.

ఇప్పటికే టెక్ దిగ్గజాల్లో ఒకటైన షియోమీ ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి సరికొత్త ఫీచర్లతో అద్భుతమైన మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశ పెడుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో రకాల మోడల్స్ మార్కెట్లోకి అడుగుపెట్టి.. కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే వినియోగదారులు మరింత టెక్నాలజీ తో కూడుకున్న స్మార్ట్ఫోన్స్ కావాలని.. అది కూడా తక్కువ ధరకే లభించాలని కోరుకుంటున్నట్లు సమాచారం. మరి అలాంటి వారి కోసం తీసుకొచ్చిన సరి కొత్త మోడల్ గురించి అలాగే దాని ఫీచర్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. షియోమీ నుంచి సరికొత్తగా అల్ట్రా సిరీస్ త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్ మొబైల్ జూలై నెలలో లాంచ్ కానుంది అని ఇప్పటికే వీటికి సంబంధించి లాంచింగ్ ఫీచర్ లకు సంబంధించి అనేక రూమర్లు కూడా బయటకి వస్తున్నాయి.

Xiaomi Mi 11 Ultra Price Low Creepy Features The newest smartphone
Xiaomi Mi 11 Ultra Price Low Creepy Features The newest smartphone

ఇకపోతే ఇప్పుడు షియోమీ అల్ట్రా స్మార్ట్ఫోన్ అధికారికంగా జూలై నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో కంపెనీ సీఈఓ మొత్తం ఫీచర్లు ప్రకటించడం జరిగింది. హ్యాండ్ సెట్ ప్రధాన ఫీచర్ కూడా వెల్లడించారు. కానీ ఖచ్చితంగా ఏ తేదీన విడుదల కాబోతోంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే షియోమీ 12 అల్ట్రా క్వాల్కమ్ టాప్ ఎండ్ స్నాప్డ్రాగన్ 8, Gen 1SoC తో ప్రాణం ఉంది అని కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది ఇక మిగతా వివరాలను కూడా కంపెనీ వెల్లడించాల్సి ఉంది. ఇకపోతే 6.7 అంగుళాల భారీ డిస్ప్లే లో ఈ స్మార్ట్ మొబైల్ వస్తుందని స్పష్టం చేశారు. ఇక క్వాల్కమ్ హెచ్ డి తో పాటు రిజల్యూషన్ తో ఈ స్మార్ట్ మొబైల్ పనిచేస్తుంది అని ఇందులో 120 Hz రిఫ్రెష్ ప్యానల్ కూడా కలిగి ఉన్నట్లు సమాచారం.

మెరుగైన సామర్థ్యాన్ని పొందడం కోసం ఎల్ టి పి ఓ టెక్నాలజీ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇక వెనుకభాగంలో మల్టీ కెమెరాలను కూడా కలిగి ఉంది ఇందులో 48 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తోపాటు 48mp 5x పెరిస్కోప్ కెమెరాతో పాటు ఫ్లైట్ కెమెరా టైం అలాగే లేజర్ ఆటోఫోకస్ కూడా ఉండవచ్చు అని సమాచారం. ఇక 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ మనకు లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే 70 వేల రూపాయల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు గల కారణం ఏమిటంటే షియోమీ 11 అల్ట్రా భారత మార్కెట్లోకి విడుదలైన కొత్త లో.. దీని ధర సుమారుగా రూ. 69,990 ప్రారంభ ధరతో మనదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్ రూ.70 వేల వరకు ఉంటుందని సమాచారం.