Business Idea : పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ.. మరి ఆ పంట ఏమిటంటే..?

Business Idea : సాధారణంగా ఎవరైనా సరే జీవితంలో బాగు పడాలి అని ఆలోచిస్తూ . అందుకు తగ్గట్టు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితం అతలాకుతలం అయింది. ఇక ఉద్యోగాలు లేక ఉన్న ఉద్యోగాలు పోయి ఆర్థికంగా చాలా మంది రోడ్డున పడ్డారు అని చెప్పవచ్చు. ఇక చేతిలో పని దొరకక తినడానికి తిండి లేక నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో. సామాన్యుడు ఏం తినాలో..? ఏం చేయాలో..? తెలియక సతమతం అవుతున్నాడు. ఇక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఆదాయాన్ని పొంది కొంచెం వెనుక వేసుకుంటే కరోనా లాంటి ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా , ఆనందంగా జీవించవచ్చు అని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. అంతేకాదు వృధాగా డబ్బు ఖర్చు చేసే వారికి కరోనా ఒక పెద్ద గుణపాఠం నేర్పింది.అందుకే చాలామంది డబ్బు వృధా చేయకుండా రూపాయికి రూపాయి దాచుకుంటూ సంపన్నులు కావాలి అని ఆలోచిస్తున్నారు.

ఇకపోతే డబ్బు సంపాదించాలి అంటే ఉద్యోగం చేయాలి లేదా ఏదైనా వ్యాపారం చేయాలి.. ఉద్యోగం చేయాలి అంటే ఉన్నత విద్య.. విద్య కు తగ్గట్టుగా ప్రతిభ ఉంటేనే ఉద్యోగం దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇటీవల కాలంలో ఎంత ప్రతిభ ఉన్నా సరే ఉద్యోగం దొరకక చాలా మంది ప్రతిభావంతులు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇక అందుకే చాలా మంది విద్యార్థులు రైతులుగా మారి వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా మంది నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడలేక వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువత. ఇక మన పంట పొలాలలో సాధ్యంకాని పంటలను కూడా పండించి వ్యవసాయం అంటే ఇలా చేయాలి అంటూ నిరూపించడమే కాకుండా ఎంతో మంది బడుగు , బలహీన వర్గాల వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. మీరు కూడా వ్యవసాయంలోకి అడుగు పెట్టాలని..డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నట్లు అయితే మీ కోసం ఒక అద్భుతమైన పంట సాగును తీసుకురావడం జరిగింది.

Business Idea of Cultivation of strawberry crop
Business Idea of Cultivation of strawberry crop

ఇక అదే స్ట్రాబెర్రీ సాగు.. ప్రస్తుతం అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ మార్కెట్లో మాత్రం డిమాండ్ తగ్గని పండ్ల జాతులలో స్ట్రాబెరీ కూడా ఒకటి అని. ఇక స్ట్రాబెర్రీలను కేవలం తినడానికే కాకుండా ఆరోగ్య పరమైన.. సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ పంట పెడితే తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వస్తుంది. ఇకపోతే స్ట్రాబెరీ సాగును రైతులు చేపట్టి ప్రస్తుతం నెలకు లక్షల రూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు మరి ఈ వ్యవసాయం గురించి ఒకసారి చదివి తెలుసుకుందాం. సాంప్రదాయ సేంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీలు పండిస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు ఎంతో మంది రైతులు. అయితే ఇటీవల ఉత్తర భారత దేశంలో చాలామంది స్ట్రాబెర్రీ సాగు చేపట్టడానికి కారణం కూడా తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం అని ఆలోచిస్తున్నారు అయితే ఈ పంట మొదలుపెట్టినప్పుడు అక్కడి రైతులు అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే మొదటిసారి .. లాభాలు వస్తాయో..? లేదో..? అని కూడా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.

కానీ ముందుకి అడుగు వేయాలి అని ఆలోచించిన ఆ రైతులు అధునాతన పద్ధతులను ఉపయోగించి సాగు చేయడంతోపాటు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి రావడం హర్షదాయకం అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రైవేటు డీలర్ల నుండి రోడ్ సైడ్ ప్రయాణికులు, పర్యాటకులకు నేరుగా అమ్మడం మొదలు పెట్టారు. కిలో 40నుంచి 45 రూపాయలకు మాత్రమే ఉండడంతో అక్కడి వారు కూడా ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇకపోతే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంది లక్షల్లో మంచి ఆదాయం కూడా లభిస్తోందని అక్కడి రైతులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా వాతావరణానికి అనుకూలంగా ఉండే ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని లక్షలు సంపాదించవచ్చు చెప్పడానికి సులభమే.. చేయడానికి కష్టం అనిపించినా ఒకసారి మీరు ఈ సాగు ప్రారంభిస్తే ఖచ్చితంగా ఈ సాగు ద్వారా లాభాలు పొందవచ్చునని.. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.